మరో 2 BC గురుకుల Degree Law కాలేజీలు

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 9, (ఇయ్యాల తెలంగాణ) : తెలంగాణ సర్కార్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా రెండు బీసీ గురుకుల డిగ్రీ లా కాలేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.రాష్ట్రంలో ఉన్నత విద్యను బలోపేతం చేసే దిశగా తెలంగాణ సర్కార్‌ మరో నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొత్తగా పలుచోట్ల డిగ్రీ కాలేజీలు ఏర్పాటు చేయగా? తాజాగా రెండు బీసీ గురుకుల డిగ్రీ లా కాలేజీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఒకటి హన్మకొండలో ఏర్పాటు చేయనుండగా? మరొకటి రంగారెడ్డి జిల్లా కందుకూరులో  నెలకొల్ప నున్నారు. ఈ మేరకు అనుమతులు మంజూరు చేస్తూ సర్కార్‌ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభించనున్నారు. ఈ కాలేజీల్లో బీఏ ఎల్‌ఎల్‌బీ, బీబీఏ ఎల్‌ఎల్‌ఎల్‌బీ 5 ఇంటిగ్రేటెడ్‌ కోర్సులను ప్రవేశపెట్టనున్నారు.ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి జూన్‌ నెలలోనే కొత్తగా 17 బీసీ గురుకుల డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసింది తెలంగాణ సర్కార్‌. ఫలితంగా రాష్ట్రంలో బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల సంఖ్య 33కు చేరింది. 

ఈ నూతన డిగ్రీ కాలేజీలతో రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో బీసీ గురుకుల డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేసినట్లు అయింది. కొత్త బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలను జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్‌, నారాయణపేట, వికారాబాద్‌, సంగారెడ్డి, కామారెడ్డి, ఆదిలాబాద్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్‌, హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఏర్పాటు చేశారు.ఈ డిగ్రీ కాలేజీలతో 16వేలకుపైగా విద్యార్థులకు లబ్ది చేకూరనుందిఈ 17 కాలేజీల్లో వినూత్న, ఉపాధినిచ్చే కోర్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది తెలంగాణ సర్కార్‌. ఇందులో భాగంగానే ఇప్పటికే వికారాబాద్‌లో ఫైన్‌ ఆర్ట్స్‌ కాలేజీలో ఫిల్మ్‌ అండ్‌ విూడియా, యానిమేషన్‌ అండ్‌ వీఎఫ్‌ఎక్స్‌, ఫొటోగ్రఫీ అండ్‌ డిజిటల్‌ ఇమేజింగ్‌ కోర్సులతో బీఏ(హనర్స్‌), సంగారెడ్డి కాలేజీలో హోటల్‌ మేనేజ్‌ మెంట్‌ కోర్సులను అందుబాటులోకి తెచ్చింది. 13 బీసీ గురుకుల గురుకుల కాలేజీల్లో బీఎస్సీ(ఎంపీసీఎస్‌), బీఎస్సీ(బీజెడ్‌సీ), బీకాం, బీఏ కోర్సులు ప్రవేశపెట్టింది. మిగిలిన 2 గురుకుల డిగ్రీ కాలేజీల్లో న్యాయవిద్యను ప్రవేశపెడుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....