మల్లన్నకు IT నోటీసులు

 హైదరాబాద్‌, అక్టోబరు 5 (ఇయ్యాల తెలంగాణ );: భక్తుల కొంగు బంగారం అయిన దేవుడికి ఆదాయపు పన్ను శాఖ నోటీసులు తప్పలేదు. పన్ను కట్టి తీరాల్సిందే అంటూ అధికారులు నోటీసులు పంపించారు. సిద్దిపేట జిల్లాలో ఉన్న కొమురవెళ్లి మల్లికార్జున స్వామి ఆలయానికి ఐటీ నోటీసులు జారీ అయ్యాయి. ఈ రోజు ఉదయమే కొమురవెళ్లి మల్లికార్జున స్వామి ఆలయానికి ఐటీ నోటీసులు జారీ చేశారు ఐటీ అధికారులు. 11 కోట్ల రూపాయలు పన్ను చెల్లించాలంటూ.. కొమురవెళ్లి మల్లికార్జున స్వామి దేవాలయానికి ఐటీ శాఖ అధికారులు నోటీసులు ఇచ్చారు.ఆదాయపు పన్ను మినహాయింపు కోసం గడువు ముగిసిన 12ం రిజిస్ట్రేషన్‌ చేయించలేదు కొమురవెళ్లి మల్లికార్జున స్వామి ఆలయ అధికారులు. 1995 నుంచి ఇప్పటివరకు ఐటీ రిటర్న్‌ లు ఆదాయపు పన్ను శాఖకు సమర్పించలేదు. 1995 నుంచి ఐటీ రిటర్న్‌ లు, ఆడిట్‌ వివరాలు సమర్పించాలని ఐటీ శాఖ ఆదేశాలు ఇచ్చింది. కొమురవెళ్లి మల్లికార్జున స్వామి ఆలయ అధికారుల నిర్లక్ష్యంతోనే ఐటీ నోటీసులు జారీ అయినట్లు అధికారులు పేర్కొన్నారు. ఆదాయపు పన్ను శాఖ దేవుడి గుడి కూడా నోటీసులు జారీ చేయడంతో విషయం తెలిసిన భక్తులు ఆశ్చర్యపోతున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....