మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి జిల్లాలకు – గత March నుంచి జీరో విద్యుత్‌ బిల్లు అమలు చేస్తాం !


👉 కరెంట్‌ షాక్‌ తో మరణించిన వారికి సంబంధించి విధాన నిర్ణయం తీసుకుంటాం

👉  సబ్‌ స్టేషన్‌ ల స్థాయిలో కమిటీలు వేసి విద్యుత్‌ సమస్యలు పరిష్కరిస్తాం

👉 నాగర్‌ కర్నూల్‌ లో విద్యుత్‌ శాఖ అధికారుల సవిూక్ష 

👉  సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు

ఎన్నికల కోడ్‌ మూలంగా ఉమ్మడి మహబూబ్‌ నగర్‌, రంగారెడ్డి జిల్లా వాసులు 2500 యూనిట్ల లోపు విద్యుత్‌ వినియోగించుకుంటే జీరో బిల్లు సౌకర్యాన్ని పొందలేకపోయారు, ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ ముగిసింది ఆ రెండు ఉమ్మడి జిల్లాల వాసులకు గత మార్చి నుంచే జీరో విద్యుత్‌ బిల్లు అమలు చేస్తాం అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు తెలిపారు. సోమవారం ఆయన నాగర్‌ కర్నూల్‌ జిల్లా మన్ననూరు లో ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా కు చెందిన ఐదు జిల్లాల ట్రాన్స్కో ఎస్సీలతో సవిూక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల కోడ్‌ మూలంగా పొందలేకపోయిన జీరో బిల్లును మార్చి నుంచి అమలు చేస్తాం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల వారి మాదిరిగానే లబ్ధి చేకూరుస్తామని డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు. ఇప్పటికే 200 యూనిట్ల లోపు విద్యుత్‌ సరఫరా వినియోగించుకొని కరెంటు బిల్లు చెల్లించి ఉంటే వారి నగదు మొత్తాన్ని అకౌంట్లో ఉంచుతాం. ఎప్పుడైనా 200 యూనిట్లకు మించి వాడుకున్న సమయంలో వారి అకౌంట్లో ఉన్న నగదును వినియోగించు కుంటామని  తెలిపారు. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎక్కువగా విద్యుత్తు సరఫరా చేసాం, గాలి, వాన అన్నిటినీ ఎదుర్కొని విూరు సేవలందిస్తున్నారు అయినా విద్యుత్‌ శాఖ పై కొద్ది మంది దుష్ప్రచారం చేస్తున్నారు అని డిప్యూటీ సీఎం తెలిపారు. దీనికి వెనుక గ్రామస్థాయిలో రాజకీయ కారణాలు ఒక అంశం కాగా, విద్యుత్‌ శాఖలోని కింది స్తాయి సిబ్బంది ఆ ప్రచారాలకు ఊ తమిస్తున్నారని తెలిపారు. ఈ విషయాలను గమనంలో పెట్టుకొని ఎప్పటికప్పుడు దుష్ప్రచారా లను ఖండిరచాలని ట్రాన్స్కో ఉన్నతాధికారులకు సూచించారు.  ప్రజలకు జవాబుదారీగా పని చేయాలి, నిబద్ధతతో ప్రజలకు ఏం చేస్తున్నామో వివరించాలని తెలిపారు. విద్యుత్‌ శాఖ అధికారులు సిబ్బంది సమస్యలు సైతం విూరు ఎందుకు మేము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాష్ట్ర జిడిపి పెంచడంలో విద్యుత్‌ శాఖ ది అత్యంత ప్రాధాన్య పాత్ర అని తెలిపారు. విద్యుత్‌ శాఖ సిబ్బంది ఎంత బాగా పనిచేస్తే రాష్ట్రంలో అంత బాగా ఉత్పత్తి పెరుగుతుంది, ఖజానాకు ఆదాయం సమకూరుతుందని వివరించారు. గ్రామస్థాయిలో జరిగే దుష్ప్రచారాలను సిబ్బంది ఖండిరచాలి, సిబ్బందికి మేము అండగా ఉంటాం సమిష్టి బాధ్యతతో పని చేద్దాం విద్యుత్‌ శాఖ సేవలు రాష్ట్ర ప్రజలకు అత్యంత అవసరమని తెలిపారు. వ్యవసాయం, పారిశ్రామిక, సేవా రంగం అన్నింటికీ జీవనాధారం విద్యుత్‌ అని తెలిపారు. సిబ్బంది నిబద్ధతతో పని చేయాలి, ప్రతి విషయాన్ని లోతుగా పరిశీలన చేస్తాను, చెడును తొలగించేందుకు వెనకాడను అని తెలిపారు. కరెంట్‌ షాక్‌ తో మరణించిన వారికి పరిహారం అందించడంలో విద్యుత్‌ శాఖ విఫలం అవుతుందని వినిపిస్తోంది, త్వరలో దీనిపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం తెలిపారు. విద్యుత్‌ వైర్లు, స్తంభాలు వంగిపో యీ ఉన్నట్టు ఫిర్యాదులు వస్తున్నాయి దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహించే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. 

విద్యుత్‌ అధికారులకు ఎమ్మెల్యేలు ఫోన్‌ చేసి సమస్య చెప్పినప్పుడు అధికారులు వెంటనే స్పందించాలి, ఎమ్మెల్యేలు తెలిపిన సమస్య ఎంతవరకు పరిష్కరించారు వారికి తిరిగి సమాధానం ఇవ్వాలని డిప్యూటీ సీఎం విద్యుత్‌ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో విద్యుత్‌ సమస్యకు సంబంధించి జీవ, టవ, బవ స్పందించలేదని బాధపడవద్దు 108 మాదిరిగా ఎవరికి, ఏ ప్రాంతంలో వారికైనా విద్యుత్‌ సమస్య వచ్చినప్పుడు 1912 నెంబర్‌ కు ఫోన్‌ చేయాలని కోరారు. కాల్‌ సెంటర్‌ కు వచ్చిన సమస్యను విద్యుత్‌ అధికారులు వెంటనే పరిష్కరిస్తారని తెలిపారు. క్షేత్రస్థాయిలో విద్యుత్‌ సమస్యలు పరిష్కరించేందుకు సబ్‌ స్టేషన్‌ ల పరిధిలో కమిటీలు ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలిపారు. రాష్ట్ర భవిష్యత్తుకు విద్యుత్‌ శాఖ జీవనాడి లాంటిదని తెలిపారు. సవిూక్ష సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ఇంధన శాఖ సీఎం డి ూఓం రి జ్వీ, ుఉూఖఆఅఒ సిఎండి ముషారాఫ్‌ అలీ ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు శ్రీహరి, వంశీకృష్ణ, కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుల్ల రాజేష్‌, పర్ణిక రెడ్డి, మెగా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....