మహా Shivaratri ఉత్సవాలకు సర్వం సిద్ధం

మహా శివరాత్రి ఉత్సవాలకు సర్వం సిద్ధం

ఏర్పాట్లలో నిమగ్నమైన దేవాదాయ శాఖ అధికారులు – ఆలయ నిర్వాహకులు

బద్వేలు

మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈనెల ఎనిమిదవ తేదీ జరిగే ఉత్సవాలకు అన్ని శివాలయాలు ముస్తాబవుతున్నాయి. బద్వేలు నియోజకవర్గంలోని ఏడు మండలాల్లో పలు శివాలయాలు ఉన్నాయి. మహాశివరాత్రి నాడు శైవ క్షేత్రాలన్నీ శివనామ స్మరణతో మారుమోగుతాయి. పలుకొండ కోనల్లో వెలసిన శివాలయాలు మహాశివరాత్రి ముందు రోజు నుంచి భక్తుల రాకపోకలు మొదలవుతాయి తేజ మృగల జ్యోతిర్లింగ

స్వరూపుడిగా పరమేశ్వరుడు జన్మించిన గొప్ప పుణ్య పర్వ దినమే మహాశివరాత్రి ఇతర పండుగల మాదిరి కాకుండా మహాశివరాత్రి రాత్రివేళ చేసుకునే పర్వదినమే మహాశివరాత్రి అలాంటి మహాశివరాత్రి భక్తులు శుభరాత్రి గా విశ్వసిస్తారు. ఆరోజు రాత్రి లింగోద్వవ సమయంలో మహా శివునికి ప్రత్యేక అభిషేకం చేస్తే తాము చేసిన పాపాలు దోషాలు పోతాయని భక్తుల విశ్వాసం వేలాదిగా తరలివచ్చే భక్తులు తమను కష్టాల భారీ నుండి కాపాడమని తమ కోరికలు తీర్చమని మహా శివుని భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అలాగే

సంతానం లేని మహిళలు ఆలయం చుట్టూ తడి బట్టలతో  పొర్లు దండాలు పెడుతూ తమకు సంతాన భాగ్యం కల్పించమని అలాగే ఆలయ ప్రాంగణంలో ఉండే చెట్లకు ఉయ్యాల కడతారు ప్రసిద్ధి పొందిన శివాలయాలకు లారీలు ట్రాక్టర్లు కూడా నడుపుతారు. జిల్లా ఎస్పీ ఆదేశాల కొరకు కొండ కోనల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి పోలీస్‌ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా పవిత్ర పుణ్యక్షేత్రాల్లో సినీ నృత్యాలు రికార్డింగ్‌ డాన్సులు లేకుండా పోలీస్‌ రెవెన్యూ అధికారులు ఇప్పటికే చర్యలు తీసుకున్నారు. పోలీసుల కన్ను కప్పి ఇలాంటివి ఎవరైనా చేస్తే చట్టపరమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. బద్వేలు నియోజకవర్గంలోని లంక మల్ల మల్లెం కొండ భైరవకోన తదితర శివాలయాలతో పాటు బద్వేల్‌ కు పక్కనే ఉన్న బ్రహ్మంగారిమఠం కు ప్రత్యేక బస్సులు ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేశారు. కాగా బద్వేలు పట్టణంలో వెలిసి ఉన్న పలు శివాలయాలు రూపరంపేట శివాలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. ప్రతి శివాలయంలో దాదాపు అన్న ప్రసాద వితరణ ఉంటుంది ఇందుకు తగిన ఏర్పాట్లు కూడా శర వేగంగా జరుగుతున్నాయి.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....