మహిళలకు RESERVATION BILL కోసం కేంద్ర CABINET ఆమోదం చారిత్రాత్మక నిర్ణయం

 

 
హైదరాబాద్‌ సెప్టెంబర్‌ 19 (ఇయ్యాల తెలంగాణ ): మహిళలకు చట్ట సభల్లో 33% రిజర్వేషన్‌ బిల్లు కోసం కేంద్ర కేబినెట్‌ ఆమోదించడం చారిత్రాత్మక నిర్ణయమని బిసి  మహిళ ఐక్యవేదిక  తెలంగాణా రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు ఏ.పుష్ప లత పేర్కొన్నారు.భారత దేశ మహిళల తరుపున , మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర మహిళల తరుపున ముక్యంగా  బిసి మహిళల తరపున నరేంద్ర మోడీ గారికి , కేంద్ర మంత్రి వర్గానికి, ఏ.పుష్ప లత హృదయ పూర్వక కృతజ్ఞతలు తిలిపారు.కచ్చితంగా పార్లమెంట్‌ ఉభయ సభల్లో కూడా మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నానన్నారు. ఐతే .మహిళా బిల్లు అందులో బిసి సబ్‌ కోటాకు కూడా ఆమోదం తెలపాలని ఆమె  డిమాండ్‌ చేసారు. మహిళా బిల్లు అందులో బిసి సబ్‌ కోటా లేకుండా ఆమోదం పొందుతే గత 20 సంవత్సరాలుగా బిసి మహిళా సంగాలు చేస్తున్నపోరాటానికి ఫలితం ఉండదని అన్నారు.ఎందుకంటే మహిళా బిల్లు ఆమోదం పొందుతే మల్లి అగ్రకులాల మహిళలే చట్టసబల్లోకి వెలుతారని, దేశ జనాబాలో60 శతం జనాబా ఉన్న బిసి లలో సగ బాగం ఉన్న మహిళలకు ప్రాదాన్యత లభించదని పేర్కొన్నారు.ఎత్తి విషయాన్ని అన్ని రాజకేయ పార్టీలు దుర్తించాలని పుష్పాలత విజ్ఞప్తి చేసారు.కేవలం మహిళల ఓట్ల  కోసం ఎజెండా పెట్టే రాజకీయాలు పార్టీలకు నిజంగా మహిళల కు సమ న్యాయం పట్ల చిత్తశుద్ధి ఉంటే పార్లమెంట్‌ లో ప్రవేశ పెట్టబోయ్‌ బిల్లు లో బిసి సం కోట కు  బేషరతుగా మద్దతు ఇవ్వాలని పుష్పలత డిమాండ్‌ చేసారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....