మహిళా రిజర్వేషన్ల పై చర్చ షురూ

నల్గోండ, సెప్టెంబర్‌ 20, (ఇయ్యాల తెలంగాణ );  పార్లమెంటులో మహిళా బిల్లును కేంద్రం ప్రవేశపెడుతున్న నేపథ్యంలో తెలంగాణలో కొత్త చిక్కొచ్చి పడిరది. అధికార బిఆర్‌ఎస్‌ ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించింది. మహిళా రిజర్వేషన్‌ బిల్లు నెగ్గితే 40 స్థానాల్లో మహిళలకు రిజర్వ్‌ చేయాల్సి ఉంటుంది. దశాబ్ధాలుగా ఊరిస్తున్న 33 శాతం మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఎట్టకేలకు లోక్‌ సభలో పాస్‌ కావడంతో హర్షం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే తెలంగాణ ఎన్నికల ముంగిట్లో ఉంది. మరో అడుగు ముందుకేసి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఇప్పటికే 119 స్థానాలకు గాను 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. కాంగ్రెస్‌, బీజేపీలు ఆశావహుల నుంచి దరఖాస్తలు స్వీకరించి వడబోత పనిలో ఉంది.ఈ దశలోనే జమిలి ఎన్నికలకు కేంద్రం సిద్ధమవుతోందంటూ వార్తలు గుప్పు మనడంతో ఎన్నికలు రెండు మూడు నెలల కాలానికి వాయిదా పడతాయానే అనుమానాలూ ఉన్నాయి. తాజాగా లోక్‌ సభలో మహిళా రిజర్వేషన్‌ బిల్లును పాస్‌ కావడంతో కొత్త చర్చకు తెరలేచింది.రాష్ట్ర శాసన సభకు జరగనున్న ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్లు అమలవుతాయా.? లేదా 2028 ఎన్నికల దాకా ఎదురు చూస్తారా..? ఒక వేళ రిజర్వేషన్లను అమలు చేసే పక్షంలో ఆ ప్రక్రియ అంతా పూర్తి కావడానికి సమయం పడుతుంది కాబట్టి.. ఎన్నికలు ఆలస్యమవుతాయా అన్న ప్రశ్నల చుట్టూ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.తెలంగాణ శాసన సభలో 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గవర్నర్‌ నామినేటెడ్‌ కోటాలో మరో ఆంగ్లో ఇండియన్‌ ఎమ్మెల్యే ఉంటారు. 33శాతం రిజర్వేషన్‌ ప్రకారం తెలంగాణలో 39 అసెంబ్లీ నియోజకవర్గాలను మహిళలకు కేటాయించాల్సి ఉంటుందని లెక్కలు గడుతున్నారు.రాష్ట్రంలో మొత్తం సీట్లు ప్రాతిపదికగా సంఖ్య ఖరారు అయ్యాక, సబ్‌ రిజర్వేషన్‌ మేరకు ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఇదే 33 శాతంలో కేటాయింపులు చేయాల్సి ఉంటుందని ఎన్నికల నిర్వహణలో అనుభవం ఉన్న ఒక అధికారి అభిప్రాయపడ్డారు. రాష్ట్ర కోటా 39 సీట్లకు గాను, మహిళా ఓటర్ల సంఖ్య అత్యధికంగా ఉన్న స్థానాలు ఈ కోటాలో ఎంపిక చేస్తారని సమాచారం. అయితే, ఆయా జిల్లాలో ఉన్న నియోజకవర్గాల సంఖ్య, అక్కడ మహిళా ఓటర్ల సంఖ్యను బట్టి ఒక్కో జిల్లాలో కనీసం ఒక స్థానం నుంచి మూడు స్థానాల వరకు కేటాయించే అవకశాలు ఉంటాయని విశ్లేషిస్తున్నారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. ఇందులో దేవరకొండ ఎస్టీలకు, నకిరేకల్‌, తుంగతుర్తి ఎస్సీలకు రిజర్వుడు స్థానాలుగా ఉన్నాయి. మహిళా ఓట్లు, మహిళా జనాభా కనీసం నాలుగైదు నియోజకవర్గాల్లో పురుషులకన్నా ఎక్కువగా ఉంది. దేవరకొండ, మునుగోడు, నకిరేకల్‌, నల్లగొండ తుంగతుర్తి నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారని ప్రాథమిక సమాచారం ఆధారంగా తెలుస్తోంది.ఇప్పటికిప్పుడు ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్‌ ను అమలు కావాలంటే జరగాల్సిన తతంగానికి సమయం పడుతుందని, కచ్చితంగా అమలు చేయాల్సేందే అనుకుంటే ఎన్నికలూ ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....