హైదరాబాద్ సెప్టెంబర్ 19 (ఇయ్యాల తెలంగాణ ): మహిళలకు చట్ట సభల్లో 33% రిజర్వేషన్ బిల్లు కోసం కేంద్ర కేబినెట్ ఆమోదించడం చారిత్రాత్మక నిర్ణయమని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణీ రుద్రమదేవి వ్యాఖ్యానించారు. భారత దేశ మహిళల తరుపున , మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర మహిళల తరుపున నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రి వర్గానికి, భారతీయ జనతా పార్టీకి హృదయ పూర్వక కృతజ్ఞతలని ఆమె అన్నారు. ఖచ్చితంగా పార్లమెంట్ ఉభయ సభల్లో కూడా మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందుతుందని ఆశిస్తున్నాం. మహిళా రిజర్వేషన్ బిల్లు ను గతంలో కూడా మొదట పార్లమెంట్ లో ప్రవేశ పెట్టింది ఎన్డీయే ప్రభుత్వమే. వరుసగా 4 సార్లు ప్రవేశ్ పెట్టింది బీజేపీ నే. త్వరలో బిల్లు అమలు చేసేది బీజేపీ ప్రభుత్వమే. గత పది సంవత్సరాలుగా బీజేపీ పార్టీ కమిటీల్లో ను 33% రిజర్వేషన్ ను అమలు చేసి తన చిత్తశుద్ధి నీ చాటింది. ఆర్థిక, విదేశీ వ్యవహారాల, రక్షణ లాంటి కీలక శాఖ లను సైతం మహిళల కు కేటాయించింది. 12 మంది నీ కేంద్ర మంత్రులు గా , 8 మందిని గవర్నర్ లు గా , నలుగురు మహిళలను ముఖ్య మంత్రులు చేసిన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. దేశ చరిత్ర లో తొలి సారి పార మిలటరీ దళాల్లో సైతం మహిళలకు చోటు నిచ్చిన ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వం. పార్లమెంట్ లో మహిళా రిజర్వేషన్ బిల్లు పత్రాలు చింపి పారేసిన పార్టీ లతో అంట కాగుతు , సొంత పార్టీ లో ఏ ఒక్క కమిటీ లో మహిళల కు స్థానం ఇవ్వని బీఆర్‌ఎస్ పార్టీ అసలు రంగు , ఎమ్మెల్సీ కవిత కథ ఇప్పుడు ఉబయ సభల్లో బిల్లు కు మధ్ఛతు ఇచ్చేటప్పుడు బయట పడ్తదని అన్నారు.
- Homepage
- National New
- మహిళా BILL BJP ఘనతే BJP నేత రాణీ రుద్రమ
మహిళా BILL BJP ఘనతే BJP నేత రాణీ రుద్రమ
Leave a Comment
Related Post