మహేష్ గౌడ్ ఇక లేరా ?

మహేష్ గౌడ్ ఇకలేరు

అనే మాటలు నమ్మలేని నిజం

మహేష్ గౌడ్ కు లేకుండే ఏ ఇజం

లాల్ దర్వాజా సింహ వాహిని అమ్మవారి సన్నిదే ఆయనకు పెన్నిధి

గల్లీ నుండి ఢిల్లీ దాకా సింహహహిని తల్లి బోనాల ఉత్సవాలను ఘనంగా జరిపిన వీరాభిమాని 

కేంద్ర, రాష్ట్ర మంత్రులను.

సినీ ప్రముఖులను,

ఉన్నత అధికారులను, గవర్నర్లను,

 పార్టీలకతీతంగా,ప్రాంతాలకతీతంగా నాయకులను   అమ్మవారి

 దేవాలయ దర్శనం కోసం ఆహ్వానించి స్వాగత సత్కారాలు చేసిన నిస్వార్థ సైనికుడు

పెద్ద పెద్ద వారి పరిచయాలు ఉన్నా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఏనాడూ ఉపయోగించుకోని  

సమాజసేవకుడు

అమ్మవారి సేవకు అన్నా !  అంటే నేనున్నా ! అంటూ రేయింబవళ్ళు అంకితమైన వాడు

చిన్న, పెద్ద అనే తేడా లేకుండా అందరికి మర్యాదతో పలకరించడం,

ప్రవర్తించడం ఆయన నైజం

నిన్న మొన్నటి వరకు మహంకాళీ మాత గురించి చెప్పిన కహానీలు,

ఇంటర్వ్యూ లు ఇచ్చిన గొంతు మూగపోయిందా ?

లాల్ దర్వాజా లో  నడియాడిన నడక ఆగిందా ?

బోనాల పండుగ కు, ఊరేగింపు రోజు వేదిక మీదినుంచి స్వాగతం చేప్పే కంచుకంఠం  ఆగిందా ?

ఆషాఢ మాసంలో ఎంతో హడావుడి, హంగామా చేసే

మహేష్ అన్న లేడు తిరిగి రాడు అనే మాటలతో ఎటు చూసినా బాధ

దిగ్భ్రాంతి, విచారం, దుఃఖం

మహేష్ అన్న కన్న కలలను నిజం చేద్దాం !

లాల్ దర్వాజా సింహ వాహిని అమ్మవారి దేవాలయ సముదాయం

విస్తీర్ణం చేసి గజ స్తంభం నిర్మాణానికి కృషి చేయడమే ఆయనకు అసలు సిసలైన నివాళి

నా అక్షరాలతో అర్పిస్తున్నాను అక్షరాంజలి…. 

( జులై 1 న మహేష్ గౌడ్ స్వర్గస్తులైన వార్త విని శోకతప్త హృదయం తో నివాళులు అర్పిస్తూ… )

      డాక్టర్.  ఎస్. విజయ భాస్కర్.,

          బాలగంజ్., లాల్ దర్వాజా.,

             9290826988

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....