మాజీ మంత్రి MALLA REDDYకి మరో భారీ షాక్‌

హైదరాబాద్‌ జులై 11 (ఇయ్యాల తెలంగాణ ):ఫిర్జాదిగూడ మున్సిపల్‌కార్పొరేషన్‌లో బీఆర్‌ఎస్‌నువీడారు.15 మంది కార్పొరేటర్లు. దీంతో ఫిర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌ బలం మరింత పెరిగింది. త్వరలోనే ఫిర్జాదిగూడ కార్పొరేషన్‌ హస్తగతం కానుంది. అయితే, ఈ15 మంది కార్పొరేటర్లతో డిప్యూటీ మేయర్‌ శివకుమార్‌ ఆధ్వర్యంలో గోవాలో క్యాంప్‌ రాజకీయం నడుపుతున్నారు. మొన్న జవహర్‌ నగర్‌, నిన్న బోడుప్పల్‌ కాంగ్రెస్‌ కైవసం అయ్యాయి.అదే బాటలో ఫిర్జాదిగూడ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కూడా హస్తగతం కానుంది. ఇదిలాఉండగా..ఎమ్మెల్యే లే పార్టీలు మారుతున్న వేళ కార్పొరేటర్లు సైతం తామెంత అనుకుంటూ బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరుతున్నారు. ఇక్కడ మరో ప్రచారం కూడా జరుగుతోంది. గత కొంత కాలంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారనే ప్రచారం జరిగింది. ఇటీవల కాలంలో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. ఇలాంటి తరుణంలో బీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన 15 మంది కార్పొరేటర్లు కాంగ్రెస్‌ పార్టీలో చేరడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మల్లారెడ్డే వెనుక ఉండి ఇదంతా నడిపిస్తున్నారా?అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....