మాజీ PM మన్మోహన్ సింగ్ చిత్రాన్ని గీసి భేష్ అనిపించిన భవాని

హైదరాబాద్, డిసెంబర్ 27 (ఇయ్యాల తెలంగాణ) : భారత మాజీ ప్రధాని దివంగత డా. మన్మోహన్ సింగ్ చిత్రాన్ని చక్కటి దస్తూరితో తన చిత్రలేఖనము లో ఇమిడ్చింది పాతబస్తీ కి చెందిన 7వ తరగతి చిన్నారి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి తో తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. చిత్రలేఖనంలో ప్రావీణ్యం కలిగిన కందికల్ గేట్ ప్రాంతానికి చెందిన పులికంటి భవాని ఏకంగా మన్మోహన్ గారి చిత్రాన్ని గీసి అబ్బుర పరిచింది. 7వ తరగతి చదువుతున్న భవాని   పాఠశాలకు సెలవు కావడంతో టీవీ లో ఉదయం నుంచి మన్మోహన్ చేసిన సేవలకు అన్ని వార్త మాధ్యమాలు ప్రసారం చేస్తున్న వార్తలకు ఆసక్తురాలైన భవాని తనవంతు కృషిగా మన్మోహన్ గారికి ఏమివ్వాలనే ఆలోచనతో ఆయన చిత్రాన్ని గీసి ఔరా అనిపించింది. చిన్నారి భవాని కనబరచిన ప్రతిభకు మనమంతా క్లాప్స్ కొట్టాల్సిందే కదా ? మన్మోహన్ పై ప్రేమతో గీసిన చిత్రానికి హ్యాట్సాఫ్ అనాల్సిందే !   

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....