మాటలను వక్రీకరిస్తున్నారు

బాద్‌, సెప్టెంబర్‌ 20 (ఇయ్యాల తెలంగాణ ): కల్వకుంట్ల కుటుంబం మాటలు తెలంగాణ సమాజం నమ్మే పరిస్థితి లేదన్నారు ఎంపీ ధర్మపురి అరవింద్‌. ఇవాళ ఆయన విూడియాతో మాట్లాడుతూ.. కేటీఆర్‌ పిల్లకుంక ప్రధాని గురించి మాట్లాడుతున్నారన్నారు. ప్రధానమంత్రి మాట్లాడి మాటలను బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ లు వక్రీకరిస్తున్నాయని ఆయన మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమకారులను కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్‌ ది అని ఆయన ఆరోపించారు. తెలంగాణ ఇస్తామని ప్రకటన చేసి కాంగ్రెస్‌ ఎందుకు వెనక్కి తీసుకుందని ఆయన ధ్వజమెత్తారు. ఆత్మహత్యలకు కారణం కాంగ్రెస్‌ కాదా అని ఎంపీ అరవింద్‌ ప్రశ్నించారు. తెలంగాణ ప్రాణ త్యాగాలకు కారణం సోనియాగాంధీ అని ఆయన విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా.. బీజేపీ మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేస్తే ఎక్కడ ఎటువంటి గొడవలు జరగలేదు, ఆందోళనలు జరగలేదు, అదే విషయం నరేంద్ర మోడీ చెప్పారని, కాంగ్రెస్‌ చరిత్రలో హీనులుగానే మిగిలిపోతారన్నారు ఎంపీ అరవింద్‌. యువత గురించి కేటీఆర్‌ మాట్లాడుతున్నాడని, సిగ్గుమాలిన కుటుంబం యువత కోసం తొమ్మిదేళ్ల కాలంలో ఏం చేశారని ఆయన ధ్వజమెత్తారు.చదువుకునేందుకు స్కాలర్‌షిప్‌ కూడా ఇవ్వట్లేదని ఆయన మండిపడ్డారు. ఉద్యమ సమయంలో యువతను రెచ్చగొట్టారని, తెలంగాణలో సారా ఏరులైపారుతుందన్నారు. అంతేకాకుండా.. ఏం ముఖం పెట్టుకొని కేటీఆర్‌ ట్విట్లు చేస్తున్నాడని, తొమ్మిదిన్నర ఏళ్ల తెలంగాణను దరిద్రులు లూటీ చేశారన్నారు. యూనివర్సిటీలను నాశనం చేశారని, చేసిన వాగ్దానాలను ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదన్నారు. కుటుంబ పాలన కేటీఆర్‌ది అని, కేటీఆర్‌ కుటుంబం రెచ్చగొట్టడం వల్లే చాలామంది ఆత్మహత్యలకు పాల్పడ్డారన్నారు. కవిత వాళ్ళ అయ్య విూదనే ఒత్తిడి తేలేదన్నారు. కవిత ఒత్తిడి వాళ్ళ నాయనే వినలేదని, కవిత డ్రామాలు ఆపాలన్నారు. కవిత ఎక్కడ పోటీ చేసినా ఓడిపోవడం ఖాయమని, రాష్ట్ర ప్రభుత్వంలో మహిళలకు ఏం చేశారన్నారు. కవిత వాళ్ళ నాయన చెంపలు వాయించాలని, మహిళలకు మేలు చేయాలని ఆయనపై డిమాండ్‌ చేయాలన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....