మార్కెట్లో నకిలీ విజయ Milk తో జాగ్రత్త !

హైదరాబాద్‌, ఫిబ్రవరి 26 (ఇయ్యాల తెలంగాణ) : కొంతమంది ప్రైవేట్‌ డైరీ వారు విజయ  పేరుతో తమ  విజయ తెలంగాణ పాల ప్యాకెట్లను విక్రయిస్తూ చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడు తున్నారని అలాంటి పాలను కొనుగోలు చేయవద్దని తెలంగాణ డైరీ డెవలప్మెంట్‌ కో`ఆపరేటివ్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ గుత్తా అమిత్‌ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం లాలాపేట్‌ లోని విజయ భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో డైరీ ఎండి చంద్రశేఖర్‌ రెడ్డి తో కలిసి చైర్మన్‌ గుత్తా అమిత్‌ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు విజయ తెలంగాణ అని బ్రాండ్‌ ఉంటేనే పాలను  కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎవరైనా తెలంగాణ నకిలీ పాలను డిస్ట్రిబ్యూటర్స్‌ వెండర్స్‌ కొనుగోలు చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే తాము కోర్టును ఆశ్రయించడం జరిగిందన్నారు. ఇలాంటి నకిలీ  విజయ పాల తో వచ్చిన ఉత్పత్తులను కొనుగోలు చేయవద్దని సూచించారు ఇవి ప్రజల ఆరోగ్యానికి సంబంధించినవి కాబట్టి తమ లోగోను పరిశీలించి కొనుగోలు చేయాలని విజ్ఞప్తి చేశారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....