విజయవాడ, సెప్టెంబర్ 07 (ఇయ్యాల తెలంగాణ) : మార్గదర్శిలో భారీగా చిట్ ఫండ్ నిబంధనల ఉల్లంఘనలు జరిగాయని ఏపీ సీఐడీ డిజి సంజయ్ పేర్కొన్నారు. వినియోగదారులు చిట్ వేయకున్నా వారి పేరుతో చిట్ లు నడుస్తుందని తెలిపారు. గోస్ట్ సబ్ స్కైబర్స్ పేరుతో మార్గదర్శి యాజమాన్యమే డబ్బులు తీసుకుంటున్నట్లు ఏపీ సీఐడి గుర్తించ్చినట్లు విూడియా సమావేశంలో వెల్లడిరచారు. కంపెనీలో ఆర్థిక మోసాలపై సబ్ స్కైబర్స్ పేర్లు బయటకి రావడంతో వారికి యాజమాన్యం బెదిరింపు కాల్స్ చేస్తోందన్నారు. దీనిపై సీఐడీ కి ఫిర్యాదులు అందినట్లు వివరించారు. మార్గదర్శి నిర్వహిస్తున్న 40 శాతం చిట్ గ్రూపుల్లో చందాదారులే లేరని, ఇతర చిట్ గ్రూపుల్లో కూడా మార్గదర్శి మోసాలకు పాల్పడినట్లు డిజి సంజయ్ వెల్లడిరచారు
మార్గదర్శిలో భారీగా Chit Fund నిబంధనల ఉల్లంఘనలు : AP CID Addl. DIG
Leave a Comment