ముందస్తు Election లా…. జమిలీ ఎన్నికలా…

దేశవ్యాప్తంగా రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రచారం జరుగుతున్న వేళ అనూహ్యంగా వన్‌ నేషన్‌ ? వన్‌ ఎలక్షన్‌ నినాదం తెరవిూదకు వచ్చింది. ఎప్పుడు ఏమైనా జరగొచ్చన్న ఉద్దేశంతో అటు విపక్ష కూటమి ఇండియా కూడా ఎన్నికలకు సిద్ధమంటూ సవాల్‌ చేస్తోంది. ఉమ్మడి కార్యాచరణతో ఉద్యమాలు చేయడంతో పాటు? సీట్ల సర్దుబాటు చేసుకోవాలని కూటమి నిర్ణయించింది.దేశ రాజకీయాల్లోనూ అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నెల 18 నుంచి ప్రత్యేకంగా పార్లమెంట్‌ సమావేశాలు ఏర్పాటు చేసింది ప్రభుత్వం.పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాల తేదీలను ప్రకటించిన తర్వాత ఢల్లీిలో ఓ రకమైన రాజకీయ వాతావరణం ఏర్పడిరది. పార్లమెంట్‌ ప్రత్యేక సమావేశాలు అని  కేంద్రం ప్రకటన చాలా మందిని ఆశ్చర్య పరిచింది. వెంటనే వన్‌ నేషన్‌ `వన్‌ ఎలక్షన్‌ తెరపైకి వచ్చింది. మాజీ రాష్ట్రపతి కోవింద్‌ ఆధ్వర్యంలో 18 మంది సభ్యులతో కమిటీ.. సెప్టెంబర్‌ 17వ తేదీలోపు నివేదిక ఇవ్వాలని ఆదేశం. దీనిపై ఢల్లీితోపాటు దేశంలోని అన్ని రాజకీయ పార్టీల్లో తీవ్ర చర్చకు దారి తీసింది.  రామ్‌ నాథ్‌ కోవింద్‌ తో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భేటీ అయ్యాడు. ఏం చర్చించారో తెలియదు కానీ.. బీజేపీ అనుకూల పక్షాలన్నీ  జమలీ ఎన్నికలకు మద్దతుగా మాట్లాడటం ప్రారంభించాయి. మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది.  ప్రభుత్వ ఉన్నతాధికారులకు కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. కేబినెట్‌ కార్యదర్శులు, వివిధ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు అందరూ ఢల్లీిలోనే ఉండాలని.. రాష్ట్రాల పర్యటనలు రద్దు చేసుకోవాలని.. మిగతా అన్ని పనులు రద్దు చేసుకుని వెంటనే ఢల్లీికి వచ్చేయాలని ఆదేశించింది కేంద్రం. ప్రధాన మంత్రి కార్యాలయం అనుమతి లేకుండా ఏ శాఖ కార్యదర్శి  ఢిల్లీ  వదిలి వెళ్లరాదంటూ హుకూం జారీ చేసింది.

ప్రత్యేక సమావేశాల్లో కీలక బిల్లులను తీసుకు రానున్నందున అధికారులపై ఈ  ఆంక్షలను విధించినట్లు తెలుస్తోంది. లోక్‌ సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల ప్రజాధనం ఆదా అవుతుందని.. ఎన్నికల నుంచి పరిపాలనా  దృష్టిని అభివృద్ధిపై మళ్లించవచ్చని లా కమిషన్‌ ఇప్పటికే  సూచించింది. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల దేశం నిరంతరం ఎన్నికల మోడ్‌ లో ఉండకుండా నిరోధించవచ్చు. అందువల్ల పరిపాలన దృష్టి అభివృద్ధి పైనే ఉంటుందని లాకమిషన్‌ నివేదిక సూచించింది. కానీ ప్రస్తుత రాజ్యాంగ చట్టంలో వన్‌ నేషన్‌.. వన్‌ ఎలక్షన్‌ నిర్వహించడం సాధ్యం కాదని కూడా కమిషన్‌ నివేదికలో పేర్కొంది.  ఇది జరగాలంటే రాజ్యాంగంలో సవరణ అవసరం అని తెలిపింది. అందుకే   రాజ్యాంగ సవరణల బిల్లును ప్రవేశపెడతారని వార్తలు వస్తున్నాయి. అయితే  జమిలీ ఎన్నికలు నిర్వహించాలంటే రాజ్యాంగంలో కనీసం ఐదు అధికరణలను సవరించాల్సి ఉంటుందని  కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఫ్‌ువాల్‌  పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల్లో రాజ్యసభలో  వెల్లడిరచారు. అయితే  ఆ సవరణల కోసమే సెప్టెంబర్‌ 18 నుంచి 22 వరకు ఐదు రోజుల పాటు  ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుందనే టాక్‌ వినిపిస్తోంది. ఈ సమావేశాల్లో  రాజ్యాంగంలోని ఐదు అధికరణలను సవరించి..జమిలి  బిల్లు తీసుకొచ్చే అవకాశాలున్నాయని ఎక్కువ మంది నమ్ముతున్నారు.  ఈ ప్రకటన వచ్చిన కొద్ది గంటల్లోనే వన్‌ నేషన్‌ ? వన్‌ ఎలక్షన్‌ బిల్లు పెడతారంటూ వార్తలు హల్‌చల్‌ చేశాయి. ఇదంతా నిజమా? అబద్దమా అంటూ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుండగానే మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం కమిటీ కూడా ఏర్పాటు చేసింది. దీంతో అంతటా ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. ముఖ్యమైన విషయాలు అంశాలు ఉన్నాయనే ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాలు ఏర్పాటు చేశామన్న కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్‌ జోషి వ్యాఖ్యలు మరింత ఉత్కంఠ రేపుతున్నాయి. 

అటు జమిలి ఎన్నికలు వార్తలపై ఆయా పార్టీల నుంచి భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఓడిపోతామనే భయంతోనే బీజేపీ జమిలి జపం చేస్తుందన్నారు తెలంగాణ మంత్రి తలసాని. అటు వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌ ఎలా సాధ్యమని ప్రశ్నించారు.  సీపీఐ నేతలు. రాజ్యాంగాన్ని ఇష్టం వచ్చినట్టు మార్చడానికి వీల్లేదంటున్నారు సీపీఐ నేతఅటు ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందంటున్న విపక్ష కూటమి.. సిద్ధమవుతోంది. ముంబైలో జరిగిన ఇండియా కూటమి కీలక నిర్ణయాలు తీసుకుంది. పలు కమిటీలు వేసిన ఇండియా కూటమి.. సాధ్యమైనంత త్వరగా సీట్లు సర్దుబాటు చేసుకోవాలని తీర్మానం చేసింది. ఇండియా కూటమి అంటే 60శాతం ప్రజలు అంటున్న రాహుల్‌ గాంధీ విజయంపై ధీమా వ్యక్తం చేశారు.మొత్తానికి దేశ రాజకీయాల్లో రాబోయే పార్లమెంట్‌ సమావేశాలు కీలకమలుపు కాబోతున్నాయా? ముందస్తు వచ్చినా సంచలనమే? వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌ బిల్లు పెట్టినా అంతకుమించిన ప్రకంపనలే పుట్టిస్తాయనడంలో సందేహం లేదు. మరి ఏది నిజం కాబోతుంది?. కానీ కేంద్రం ఏం చేయాలనుకుంటే అది చేయగలుగుతుంది. ఎందుకంటే అధికారం కేంద్రం చేతుల్ల ?ఉంది. ఒక వేళ ప్రజావ్యతిరేకమైనా ఆమోదిస్తే బీజేపీ పెద్దలు మూల్యం చెల్లించుకుంటారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....