హైదరాబాద్ జూలై 25 (ఇయ్యాల తెలంగాణ ): హైకోర్టు తీర్పును కూడా ముఖ్యమంత్రి అపహస్యం చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శలు గుప్పించారు.’’ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్ధాలు తప్ప.. నిజాలు చెప్పటం లేదు. కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ఇచ్చిన గెస్ట్ లెక్చరర్స్ హావిూ నెరవేరలేదు. హైకోర్టు తీర్పును కూడా ముఖ్యమంత్రి అపహస్యం చేశారు. సెలవులు వస్తే గెస్ట్ లెక్చరర్స్‌కు జీతాలు రావటం లేదు. గెస్ట్ లెక్చరర్స్ అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నాను. అరెస్ట్ చేసిన గెస్ట్ లెక్చరర్స్‌ను తక్షణమే విడుదల చేయాలి. ఉద్యోగ భద్రత కల్పించడంతోపాటు 12 నెలల జీతాలు ఇవ్వాలి. కేసీఆర్‌ను ప్రశ్నించినా.. అడుకున్నా సహించరు. దేశ ప్రధాని కార్మికుల కాళ్లు కడుగుతుంటే.. కేసీఆర్ కార్మికులను ఉద్యోగాల నుంచి తీసివేశారు. ఆర్టీసీ సమ్మె చేస్తే అశ్వద్దామరెడ్డిని ఉద్యోగంలో నుంచి తొలగించాలని ఆదేశించారు. కేసీఆర్ భూములపై కన్నేశారు.’’ అని ఈటల సంచలన ఆరోపణలు చేశారు.
- Homepage
- Telangana News
- ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్ధాలు తప్ప.. నిజాలు చెప్పటం లేదు
ముఖ్యమంత్రి కేసీఆర్ అబద్ధాలు తప్ప.. నిజాలు చెప్పటం లేదు
Leave a Comment
Related Post