జులై 12, (ఇయ్యాల తెలంగాణ ): ఉచిత విద్యుత్ పై టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వాక్యాలను వక్రీకరిస్తూ బీఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న దుష్ప్రచారాలకు నిరసనగా టిపీసీసీ ఇచ్చిన పిలుపుమేరకు కరీంనగర్ జిల్లా గంగాధర మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గంగాధర మండల కేంద్రంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ముందు ముఖ్యమంత్రి కెసిఆర్ దిష్టిబొమ్మను కాంగ్రెస్ పార్టీ నాయకులు బుధవారం దహనం చేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పురమల్ల మనోహర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రాముడి రాజిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుబ్బాసి బుచ్చన్న, మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దోర్నాల శ్రీనివాస్ రెడ్డి, మండల యువ నాయకులు వొడ్నాల యగ్నేష్, ఉపాధ్యక్షులు తోట కరుణాకర్, జిల్లా బీసీ సెల్ కార్యదర్శి రుద్ర మల్లేశం, దోమకొండ మహేష్,దూలం లక్ష్మీరాజం, ముచ్చె శంకర్, పెద్దోళ్ల రాజేశం, పుల్కం నరసయ్య, కముటం శ్రీనివాస్, వొడ్నాల వంశీ, ఆముదాల రోహిత్ రెడ్డి, తూం వినయ్, శివ, చరణ్ రావు, మంచాల రవి, కుమారస్వామి, వెంకటేష్, హైమద్, అఖిల్, తదితరులు పాల్గొన్నారు.
- Homepage
- Telangana News
- ముఖ్యమంత్ర కేసీఆర్ దిష్టి బొమ్మ దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు
ముఖ్యమంత్ర కేసీఆర్ దిష్టి బొమ్మ దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు
Leave a Comment