ముగ్గురు DRUG పెడ్లర్స్‌ అరెస్టు

సికింద్రాబాద్‌ జులై 4 (ఇయ్యాల తెలంగాణ );ఖార్ఖాన పోలీసులతో కలిసి ఆంటీ నార్కోటిక్‌ పోలీసులు  డ్రగ్స్‌ వాడుతున్నారన్న సమాచారంతో కాలేజ్‌ విద్యార్థులను అదుపులోకి తీసుకొని విచారించడం జరిగింది. వారిచ్చిన రి సమాచారంతో  ముగ్గురు పెడ్లార్స్‌ ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌ కు తరలించినట్లు నార్త్‌ జోన్‌ డిసిపి రేష్మి పెరుమాళ్‌ తెలిపారు.అంటీ నార్కోటిక్‌ బ్యూరో డీసీపీ రాజ్‌  చైతన్య మాట్లాడుతూ  మాదకద్రవ్యాల  రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం ప్రభుత్వ ద్యేయం. డ్రగ్స్‌ సరఫరా చేయడమే కాదు వాడడం కూడా నేరమే. డ్రగ్స్‌ కు బానిసలైన వారిని గుర్తించి వారిలో మార్పు తీసుకు రావడం కోసం ప్రయత్నం. దీనిలో ప్రతి ఒక్క పౌరుడి సహకారం అవసరం. తమ విద్యార్థులు డ్రగ్స్‌ కు అలవాటు పడితే కలశాల యాజమాన్యాలు కూడా బాధ్యులు అవుతారు. వారి కాలశాల విద్యార్థులు వాటికి అలవాటు పడుతుంటే వారు ఏమి చేస్తున్నారనే ప్రశ్న ఉత్పన్నం కాకుండా చూడాలి. విూకు ఎటువంటి సమాచారం ఉన్న మాకు సమాచారం ఇవ్వండి. విద్యా సంస్థలు అన్ని కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కలశాలలో ఇవ్వి దొరికితే కలశాల పై చర్యలతో పాటు గుర్తింపు కూడా రద్దు చేస్తాము. ప్రజలలో చైతన్యం తీసుకు రావడం కోసం చిత్రం కూడా తీయనున్నాము. డ్రగ్స్‌ పై  అందరం కలసి యుద్ధం చేద్దామని అన్నారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....