ముదిరాజ్ కులస్తులను BC – D నుంచి BC – A కి మార్చాలి : జిఓ 15 అమలు పరచాలి

హైదరాబాద్, డిసెంబర్ 10 (ఇయ్యాల తెలంగాణ) :  ముదిరాజ్ కులస్తులను BC – D నుంచి BC – A కు మార్చడానికి ప్రస్తుతం కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేయాలని తెలంగాణ ఉద్యమకారుడు పొట్ట కాయల వెంకటేశ్వర్లు ముదిరాజ్, హైకోర్టు న్యాయవాది శ్రీనివాసరాజు నాగరాజ్ లు కోరారు.  తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన సందర్భంగా ముదిరాజులకు ఇచ్చిన హామీ లు నెరవేర్చాలని కోరారు. గతంలోని  వైయస్ రాజశేఖర్ రెడ్డి ఇచ్చిన హామీని తెలంగాణ ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు పరచాలని గుర్తుచేశారు.  ముదిరాజ్ కులస్తులను బి సి డి నుంచి ఏ కు మార్చాలని  జిఓ 15 అమలు పరచాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజ్ లు అనేక రంగాల్లో వెనుక బడి ఉన్నారని గుర్తు చేశారు.  ముదిరాజ్ ల అనేక సమస్యలను పరిష్కరిస్తారని  పేర్కొన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....