మునిగిన ఓరుగల్లు

 వరంగల్‌, జూలై 28, (ఇయ్యాల తెలంగా ):తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో ఓరుగల్లు వాసులు విలవిలలాడిపోతున్నారు. దాదాపు 70కి పైగా కాలనీలు పూర్తిగా నీట మునిగాయి. నగరంలోని రహదారులన్నీ చెరువులను తలపిస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి.అల్పపీడన ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా వర్షాలు భారీగా కురుస్తున్నాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు, కుంటలు రాత్రికి రాత్రే నిండిపోయిన దృశ్యాలు కనిపిస్తున్నాయి. రహదారులపై రాకపోకలు నిలిచిపోయాయి. వాగులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. అయితే విస్తారంగా కురుస్తున్న వానల దాటికి ఉమ్మడి ఓరుగల్లు జిల్లా అతలాకుతలం అవుతోంది. ఫలితంగా వరంగల్‌లోని చాలా కాలనీలు వరద గుప్పిట్లోనే చిక్కుకున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ముంపు బాధితులను ఇప్పటికే ఖాళీ చేయించిన అధికారులు… పునరావాసాలకు తరలించారు.వరంగల్‌ నగరంలో దాదాపు 70 కాలనీలు నీట మునిగాయి. ఇళ్లు, గుడిసెల్లోకి వరద నీరు చేరి నిత్యాసవరాలు, సామగ్రి తడిసిపోయాయి. వందలాది మందిని పునరావాస కేంద్రాలకు తరలించారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా పరిధిలోని అతిభారీ వర్షపాతం నమోదైంది. ఇక వరంగల్‌ సంతోషి మాత టెంపుల్‌ దగ్గర భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. గంట గంటకు ఉద్ధృతి పెరుగుతోంది.వరంగల్‌ రైల్వే స్టేషన్‌లోకి భారీగా వరద నీరు చేరింది. భద్రకాళి ఆలయం వద్ద అయ్యప్పస్వామి గుడిలోకి వరద పోటెత్తింది. వరంగల్‌`ఖమ్మం జాతీయ రహదారి జలదిగ్బంధమైంది. పంతిని వద్ద ఊర చెరువు ఉప్పొంగడంతో రోడ్డుపై భారీగా వరద ప్రవహిస్తోంది. నగరంలో ఉన్న ఎస్‌ఆర్‌ వర్శిటీ వద్ద భారీగా వరద నీరు చేరింది. ములుగు రోడ్డు జంక్షన్‌ వద్ద పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. తాళ్ల పద్మావతి కాలేజీ వద్ద ఉన్న మిషన్‌ భగీరథ పంప్‌ సెట్‌ లోకి కూడా వరద నీరు చేరింది. భవానీ నగర్‌, నయిమ్‌ నగర్‌, శివనగర్‌, ఎల్బీ నగర్‌, కొత్తవాడ, కరీంబాద్‌ తో పాటు చాలా కాలనీలు జలదిగ్భందంలో చిక్కుకుపోయాయి.త్రినగరిలో లోతట్టు ప్రాంతాలు నీటమునిగిపోయాయి. చారిత్రక నగరంలోని రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఖిల్లా వరంగల్‌ లోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది.

 కాకతీయ తోరణాల చుట్టూ వరద నీరు వచ్చి చేరింది. కాశీబుగ్గ పరిధిలోని పలు కాలనీల ప్రజల్ని పునరావాస కేంద్రానికి తరలించారు. భారీ వర్షాలకు పలు చోట్ల చెట్లు కూలిపోయాయి. చాలా కాలనీల్లో విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. వర్షాల నేపథ్యంలో ఏనమాముల ూఖీ నగర్‌ మునిగిపోయింది. ఇక నగర శివారు ప్రాంతాల్లో ఉన్న చెరువులు ఉద్ధృతంగా పారుతున్నాయి. అధికారులు పరిస్థితిని సవిూక్షిస్తూ? సహాయక చర్యలు చేపడుతున్నారు.మరోవైపు గతంలో ఎన్నడూ లేనంతగా తెలంగాణ వ్యాప్తంగా వానలు కురుస్తున్నాయి. వానలపై సీఎం కేసీఆర్‌ సవిూక్ష నిర్వహిస్తున్నారు. జిల్లా అధికారుల ద్వారా ఎప్పటికప్పుడు పరిస్థితిని తనకు తెలియజేయాలని సీఎస్‌ ను ఆదేశించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....