మూడవ రోజు కొనసాగిన S I అభ్యర్ధుల EVENT


కర్నూలు,ఆగస్ట్‌ 29 (ఇయ్యాల తెలంగాణ ):పోలీసు నియామక పక్రియలో భాగంగా రాయలసీమ జోన్‌ కు  సంబంధించి ఎస్సై ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్ధులకు  కర్నూలు  ఖూఖ 2 వ  బెటాలియన్‌ లో మూడవ రోజు దేహదారుడ్య  పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి.ఈ రోజు  800 మంది అభ్యర్దులను పిలిచారు.కాని 541మంది అభ్యర్దులు హజరయ్యారు. ఎస్సె మెయిన్స్‌ ఫైనల్‌ పరీక్ష కు ఈ రోజు  383 మంది ఎంపికయ్యారు. కర్నూలు రేంజ్‌ డిఐజి  ఎస్‌. సెంథిల్‌ కుమార్‌, జిల్లా ఎస్పీ  జి. కృష్ణకాంత్‌   దేహాదారుడ్య సామర్థ్య పరీక్షలను పర్యవేక్షించారు.దేహాదారుడ్యు పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులు వెరిఫికేషన్‌ కోసం ఖచ్చితంగా ఒరిజినల్‌ ధువపత్రాలతో హాజరు  కావాలని,  లేటెస్ట్‌  కుల దృవీకరణ సర్టిఫికెట్‌ , క్రిమిలేయర్‌ సర్టిఫికెట్‌ , ఆధార్‌, అడ్మిట్‌ కార్డు,  స్టడీ, మార్కిలిస్టులు, అన్ని ఒరిజినల్‌ సర్టిఫికెట్స్‌ మరియు జిరాక్స్‌ సర్టిఫికెట్లు  ( గెజిటెడ్‌ సంతకంతో )  తప్పనిసరిగా తీసుకుని రావలెనని జిల్లా ఎస్పీ  జి. కృష్ణకాంత్‌ తెలిపారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....