మూసీనదీ అభివృద్దిపై CM రేవంత్‌ సవిూక్ష

అభివృద్ది పనులు వేగవంతం చేయాలని ఆదేశం

హైదరాబాద్‌, ఫిబ్రవరి 19 (ఇయ్యాల తెలంగాణ) : మూసీ నదీ పరివాహక అభివృద్ధిపై నానక్‌ రామ్‌ గూడ హెచ్‌ఎండీఏ కార్యాలయంలో అధికారులతో సీఎం రేవంత్‌ రెడ్డి సవిూక్ష నిర్వహించారు. మూసీ రివర్‌ బౌండరీస్‌ లొకేషన్‌  స్కెచ్‌ తో పాటు పలు వివరాలను సీఎం కు   అధికారులు వివరించారు. మూసీ అభివృద్ధి ప్రక్రియ వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు కసరత్తు పూర్తి చేయాలని అధికారులకు సీఎం ఆదేశం ఇచ్చారు. ఇందుకు ముందుగా మూసీ క్లీనింగ్‌ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. నగరంలోని చారిత్రక కట్టడాలను కలుపుతూ ఉండేలా మూసీ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలన్‌ఆనరు. అధికారులకు పని విభజన చేసి మూసీ నదీ పరివాహక అభివృద్ధికి చర్యలు వేగవంతం చేయాలని సూచించారుర

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....