మెంబర్‌ షిప్‌ డ్రైవ్‌ లో BJP

హైదరాబాద్‌, ఆగస్టు 23, (ఇయ్యాల తెలంగాణ) : కేంద్రంలో మూడోసారి అధికారం దక్కించుకున్నాక, సంస్థాగత ఎన్నికలపై కమలనాథులు ఫోకస్‌ చేశారు. మెంబర్‌ షిప్‌ డ్రైవ్‌తో దేశవ్యాప్తంగా ఆ ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నారు. దాదాపు మూడు నెలల పాటు సాగే సుదీర్ఘ ప్రక్రియతో బూత్‌ కమిటీ అధ్యక్షుడి నుంచి జాతీయ అధ్యక్షుడి వరకు పార్టీలో ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలో ఈ ప్రక్రియతో కొత్త అధ్యక్షుడి ఎంపికపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది.కమలం పార్టీలో సంస్థాగత సంగ్రామానికి సర్వం సిద్ధమైంది. దేశవ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమంతో దీన్ని ప్రారంభించబోతున్నారు. బీజేపీ సభ్యత్వ నమోదు అభియాన్‌ పై డిల్లీలో వర్క్‌ షాప్‌ తర్వాత సికింద్రాబాద్‌ క్లాసిక్‌ గార్డెన్‌ లో రాష్ట్రస్థాయి వర్క్‌ షాప్‌ నిర్వహించారు. సభ్యత్వ నమోదు పై పార్టీ శ్రేణులకు నేతలు దిశానిర్దేశం చేశారు. సభ్యత్వ నమోదు విధివిధానాలు పార్టీ నాయకత్వం ప్రకటించింది. సభ్యత్వ నమోదు కు సంబంధించి తెలంగాణలో 12 మందితో ఓ కమిటీనీ కూడా నియమించారు. ఇందులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి, పార్టీ ప్రధాన కార్యదర్శులతోపాటు పార్టీ ముఖ్య నేతలు ఉన్నారు. తెలంగాణలో మెంబర్‌ షిప్‌ డ్రైవ్‌ ను పెద్ద ఎత్తున నిర్వహించడంతో పాటు లోకల్‌ వార్‌ కు సైరన్‌ మోగించారుసికింద్రాబాద్‌ క్లాసిక్‌ గార్డెన్‌ లో జరిగిన సభ్యత్వ నమోదు వర్క్‌ షాప్‌ లో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి, కేంద్రమంత్రి బండి సంజయ్‌, కేంద్ర పార్టీ నుంచి విజయ రహత్కర్‌, అభయ్‌ పాటిల్‌ పాల్గొనగా.. ఎంపీలు లక్ష్మణ్‌, ఈటల రాజేందర్‌, బిజేఎల్పీ నేత మహేశ్వరరెడ్డి సహా పలువురు నేతలు హాజరయ్యారు. ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా గుర్తింపు ఉన్న బీజేపీని సంస్థాగతంగా మరింత బలోపేతం చేయాలని కిషన్‌ రెడ్డి పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల సమరానికి సిద్ధమయ్యేలా ప్రణాళికలు వేస్కోని.. సభ్యత్వ నమోదులో మహిళలు. యువత, రైతులపై ఎక్కువ ఫోకస్‌ పెట్టాలని సూచించారు కిషన్‌ రెడ్డి.

మెంబర్‌ షిప్‌ డ్రైవ్‌ ఫస్ట్‌ పేజ్‌ సెప్టెంబర్‌ 1 నుంచి ప్రారంభం : 

మెంబర్‌ షిప్‌ డ్రైవ్‌ ఫస్ట్‌ పేజ్‌ సెప్టెంబర్‌ 1 నుంచి ప్రారంభం కానుంది. సెప్టెంబర్‌ 1 నుండి సెప్టెంబర్‌ 25 వరకు మొదటి విడత, అక్టోబర్‌ 1 నుంచి అక్టోబర్‌ 15 వరకుప రెండో విడత సభ్యత్వ నమోదు నిర్వహించనున్నారు. అంతకుముందు ఆగస్ట్‌ , 24, 25 తేదీల్లో జిల్లా స్థాయి వర్క్స్‌ షాప్స్‌, ఆగస్ట్‌ 26 నుంచి 30 మండల స్థాయి వర్క్‌ షాప్స్‌, ఆగస్ట్‌ 30 రాష్ట్ర స్థాయి మోర్చాలా వర్క్‌ షాప్స్‌, ఆగస్ట్‌ 31 పోలింగ్‌ బూత్‌ స్థాయి వర్క్‌ షాప్స్‌ నిర్వహిస్తారు. ఈ సారి తెలంగాణలో దాదాపు 50 లక్షల సభ్యత్వం టార్గెట్‌ గా బీజేపీ ముందుకు వెళ్తోంది.మెంబర్‌ షిప్‌ డ్రైవ్‌ తర్వాత సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. కింది స్థాయి నుంచి పార్టీ అంతర్గత ఎన్నికలు జరగనున్నాయి. బూత్‌ కమిటి అధ్యక్షుల ఎన్నిక మొదట జరుగుతుంది. తర్వాత మండల కమిటీ, జిల్లా కమిటీ అధ్యక్షుల ఎన్నిక వరస క్రమంలో నిర్వహిస్తారు. ఆపై రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక డిసెంబర్‌ లో జరిగే ఛాన్స్‌ కనిపిస్తోంది. దేశంలో సగానికి పైగా రాష్ట్రాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుని ఎన్నిక పూర్తయితే జాతీయ అధ్యక్ష ఎన్నిక జరుగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల ఉన్న రాష్ట్రాలకు నేరుగానే అధ్యక్షుల ఎంపిక చేస్తున్నా, కమల అధినాయకత్వం? మిగిలిన రాష్ట్రాలకు తొందర పడకుండా ఎన్నిక ప్రక్రియద్వారానే అధ్యక్షుల ఎంపిక పూర్తి చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.లోక్‌ సభ ఎన్నికల తర్వాత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి కిషన్‌ రెడ్డి రెండోసారి కేంద్రమంత్రి కావడంతో ఆయన ప్లేస్‌ లో కొత్త అధ్యక్షుడు వస్తారని జోరుగా ప్రచారం సాగుతోంది. పలువురి పేర్లు కూడా రేసులో ముందున్నాయి. మరికొంత మంది పేర్లు కన్ఫర్మ అయ్యాయని వార్తలు చక్కర్లు కొట్టాయి. అవే పేర్లతో సంస్థాగత ఎన్నికల్లోనే కొత్త అధ్యక్షుని ఎన్నిక ఉంటుందని పార్టీనేతలు అంటున్నారు. ప్రస్తుతం మెంబర్‌ షిప్‌ డ్రైవ్‌ తో బిజీ షెడ్యూల్‌ లోకి బీజేపీ వెళ్లబోతుందన్న మాట..!

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....