‘మెకానిక్‌ రాకీ’ అక్టోబర్‌ 31న దీపావళి సందర్భంగా World వైడ్‌ రిలీజ్‌ !

 

విశ్వక్‌ సేన్‌, రవితేజ ముళ్లపూడి, రామ్‌ తాళ్లూరి, ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ‘మెకానిక్‌ రాకీ’ అక్టోబర్‌ 31న దీపావళి సందర్భంగా వరల్డ్‌ వైడ్‌ రిలీజ్‌

యంగ్‌ అండ్‌ టాలెంటెడ్‌ హీరో విశ్వక్‌ సేన్‌ తన అప్‌ కమింగ్‌ మూవీలో ‘మెకానిక్‌ రాకీ’గా అలరించబోతున్నారు. నూతన దర్శకుడు రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ూఖీు ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత రామ్‌ తాళ్లూరి నిర్మించారు. హై బడ్జెట్‌తో భారీ కాన్వాస్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విశ్వక్‌ సేన్‌ సరసన విూనాక్షి చౌదరి హీరోయిన్‌ గా నటిస్తోంది.

మెకానిక్‌ రాకీ చిత్రాన్ని అక్టోబర్‌ 31న దీపావళి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు మేకర్స్‌ అఫీషియల్‌ గా అనౌన్స్‌ చేశారు. గురువారం రాబోతున్న ఈ సినిమాకు లాంగ్‌ వీకెండ్‌ అడ్వాంటేజ్‌ వుంటుంది. రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌లో విశ్వక్‌ సేన్‌ గన్‌, రెంచ్‌ను పట్టుకుని బాడ్‌ యాస్‌ అవతార్‌లో కనిపించారు. మెకానిక్‌గా తన క్యారెక్టర్‌ ప్రజెంట్‌ చేస్తూ, పోస్టర్‌లో ఓల్డ్‌ కార్స్‌ కూడా వున్నాయి.

కామెడీ, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో టాప్‌ టెక్నిషియన్స్‌ పనిచేస్తున్నారు. ఈ చిత్రానికి జేక్స్‌ బిజోయ్‌ సంగీతం అందించారు. మనోజ్‌ కటసాని డీవోపీ, అన్వర్‌ అలీ ఎడిటర్‌, క్రాంతి ప్రియం ప్రొడక్షన్‌ డిజైనర్‌. సత్యం రాజేష్‌, విద్యాసాగర్‌ జె ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌.

నటీనటులు: విశ్వక్‌ సేన్‌, విూనాక్షి చౌదరి, నరేష్‌, వైవా హర్ష, హర్షవర్ధన్‌, రోడీస్‌ రఘు రామ్‌

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....