మొండి ప్రభుత్వంతో పోరాడి సాధించుకున్న Anganwadi వర్కర్ల అభినందన సభ

ఎమ్మిగనూరు, జనవరి 24 (ఇయ్యాల తెలంగాణ) : 42 రోజులుగా వైసిపి ప్రభుత్వంతో పోరాడి ప్రభుత్వాన్ని మెడలోంచి తమ డిమాండ్లను సాధించుకున్న ఆంధ్రప్రదేశ్‌ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) తాసిల్దార్‌ కార్యాలయ ప్రాంగణంలో అభినందనలు సభ బుధవారం నిర్వహించారు. ఈ సభకు ఆంధ్రప్రదేశ్‌ అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) నాయకురాలు గోవర్ధనమ్మ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జరిగిన అభినందన సభలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అంజిబాబు, జిల్లా ఉపాధ్యక్షులు బి. రామాంజనేయులు, డివిజన్‌ అధ్యక్ష కార్యదర్శులు గోవిందు, రాముడు మాట్లాడుతూ వీరోచితమైన అంగన్వాడీ వర్కర్ల పోరాటం కార్మిక లోకానికే దిక్సూచి అని వారన్నారు. చారిత్రకంగా చూసిన ఈ సమ్మె కార్మిక వర్గానికి పోరాటపటిమను పెంచేదిగా ఉందని వారన్నారు. 42 రోజులుగా ప్రభుత్వం అంగన్వాడి వర్కర్లను చాలా ఇబ్బందులకు గురి చేసిందని తెలిపారు. అంగన్వాడి సెంటర్లకు తాళాలు వేసి, ఇతర ప్రభుత్వ సిబ్బందితో వారి విధులను నిర్వర్తింపజేసి, విధులకు హాజరుకాని వారిపై ఉద్యోగాల నుంచి తొలగిస్తామని చెప్పి బెదిరింపు, ఈ 42 రోజులుగా వారు చేసిన పోరాటాలపై పోలీసు నిర్బంధం, అరెస్టులు, చివరికి ఎస్మా చట్టాన్ని ప్రయోగించి ఉద్యోగాల్లో చేరకపోతే కొత్తవారిని నియమించటానికి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినప్పటికీ చివరికి, జగనన్నకు చెబుదాం పేరుతో కోటి సంతకాలను సేకరించి విజయవాడకు బయలుదేరిన అంగన్వాడీలను ఎక్కడికెక్కడికే అరెస్టు చేసి నిర్బంధించిన, తిరిగి స్వస్థలాలకు చేరకుండా ఎక్కడ అరెస్ట్‌ చేస్తే అక్కడే పోరాటాన్ని సాగించారని, ఆధార ని బెదరని అంగన్వాడీల పోరాటం చివరకు విజయం సాధించి సమ్మె విరమించినందుకు అందరికీ పేరుపేరునా జేజేలు పలికింది. ఈ సమ్మె పోరాట సందర్భంగా ఎమ్మిగనూరు ప్రాజెక్టు పరిధిలో సహకరించిన వివిధ రాజకీయ పార్టీలు, వామపక్షాలు,జనసేన, టిడిపి,  కార్మిక సంఘాలు సిఐటియు, ఎఐటియుసి, ఐఎఫ్టియు, ప్రజా సంఘాలు రైతు సంఘాలు, కేవిపిఎస్‌, యుటిఎఫ్‌, ఎస్‌ టి యు, డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ, వికలాంగుల సంక్షేమ సంఘం, అన్ని ప్రజాసంఘాలకు, విూడియా మిత్రులకు, జర్నలిస్టులకు పేరుపేరునా అభినందనలు తెలియజేశారు. ఈ ఉద్యమ తోడ్పాటు కు అహర్నిశలు సహకరించిన సిఐటి నాయకత్వానికి సన్మానం చేశారు. విజయోత్సవానికి చిహ్నంగా కేక్‌ కట్‌ చేశారు. డిమాండ్ల పరిష్కారం సందర్భంగా విజయోత్సవంలో సోమప్ప సర్కిల్‌ లో బాణసంచా కాల్చి తమ ఆనందాన్ని వెలిబుచ్చారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ సిఐటియు నాయకురాలు శైలజ, నీరజ పుష్పవతి నాగలక్ష్మి, సునీత, గౌసియా, పార్వతి, రాగమ్మ, సుమిత్ర, శంషాద్‌ భాను, తులసి, అరుణ, నాగేశ్వరమ్మ, ప్రజా సంఘాల నాయకులు రైతు సంఘం డివిజన్‌ అధ్యక్షులు లక్ష్మీ నరసయ్య, డివైఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు సురేష్‌, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా ఉపాధ్యక్షులు విజయ్‌ తదితరులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....