మెదక్ జులై 09 (ఇయ్యాల తెలంగాణ );మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్ హాస్టల్ లో విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. ఉదయం అల్పాహారం దొడ్డు ఉప్మా సేవించిన విద్యార్థులు ఒక్కొక్కరుగా వాంతులు చేసుకోవడంతో 20 మంది విద్యార్థులను రామయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురికి తీవ్రస్వస్థత కాగా మరో 17 మందికి స్వల్ప అస్తత గురయ్యారు వారిని పరీక్షించిన వైద్య బృందం తిరిగి పంపించారు ముగ్గురు మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మరో 20 మంది విద్యార్థులు తమకు కళ్ళు తిరుగుతున్నాయంటూ తెలియడంతో వారిని కూడా సిబ్బంది ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆసుపత్రికి చేరుకొని విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు