మోడల్‌ School విద్యార్దులకు అస్వస్థత

మెదక్‌ జులై 09 (ఇయ్యాల తెలంగాణ );మెదక్‌ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్‌ స్కూల్‌ హాస్టల్‌ లో విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. ఉదయం అల్పాహారం దొడ్డు ఉప్మా సేవించిన విద్యార్థులు ఒక్కొక్కరుగా వాంతులు చేసుకోవడంతో 20 మంది విద్యార్థులను రామయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముగ్గురికి తీవ్రస్వస్థత కాగా మరో 17 మందికి స్వల్ప అస్తత గురయ్యారు వారిని పరీక్షించిన వైద్య బృందం తిరిగి పంపించారు ముగ్గురు మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు మరో 20 మంది విద్యార్థులు తమకు కళ్ళు తిరుగుతున్నాయంటూ తెలియడంతో వారిని కూడా సిబ్బంది ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆసుపత్రికి చేరుకొని విద్యార్థులను పరామర్శించారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సిబ్బందికి సూచించారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....