నిజాంపేట్ , మే 03 (ఇయ్యాల తెలంగాణ) : ప్రధాని నరేంద్ర మోడీ జనగణన, కుల గణన ప్రక్రియ కొనసాగిస్తామని, అత్యంత పకడ్బందీగా కుల గణన చేపడతామని ప్రకటించడంతో నరేంద్ర మోడీ చిత్ర పటానికి నిజాంపేట్ బిజెపి అధ్యక్షుడు బిక్షపతి యాదవ్ గారి ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. నిజాంపేట్ హనుమాన్ టెంపుల్ దగ్గర దేశ ప్రధాని మోడీ చిత్ర పటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. దేశ సౌభాగ్యం కోసం నరేంద్ర మోడీ తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలు ప్రపంచములోకెల్లా భారత దేశ ఔన్నత్యాన్ని పెంచుతోందని కొనియాడారు ఈ కార్యక్రమంలో బిజెపి ఓబీసీ సెల్ నిజాంపేట్ అధ్యక్షులు పొట్లకాయల వెంకటేశ్వర్లు ముదిరాజ్, బిజెపి కార్యకర్తలు ఈ కార్య క్రమంలో పాల్గొన్నారు.
- Homepage
- Telangana News
- మోడీ చేపడతామన్న జనగణన, కులగణన పై నిజాంపేట BJP హర్షం !
మోడీ చేపడతామన్న జనగణన, కులగణన పై నిజాంపేట BJP హర్షం !
Leave a Comment