యశోభూమిని ప్రారంభించిన ప్రధాని

న్యూఢల్లీ  సెప్టెంబర్‌ 17, (ఇయ్యాల తెలంగాణ );ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన పుట్టిన రోజున వేలాది కోట్లతో నిర్మించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా చేతి వృత్తుల వారి కోసం 13 వేల కోట్లతో ‘పీఎం విశ్వకర్మ’ పథకానికి శ్రీకారం చుట్టారు. ద్వారకా సెక్టార్‌ 21 నుంచి సెక్టార్‌ 25 వరకు పొడగించిన ఢల్లోి ఎయిర్‌పోర్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ లైన్‌ను ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మెట్రో ఉద్యోగులతో ప్రధాని మోడీ ముచ్చటించారు. అనంతరం ప్రధాని మోడీ మెట్రోలో ప్రయాణించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీతో పిల్లలు, ప్రయాణికులు సెల్ఫీలు దిగారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ వారితో సరదాగా మాట్లాడారు.

విశ్వకర్మ జయంతి సందర్భంగా ద్వారకలోని ఇండియా ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌పో సెంటర్‌లో ‘పిఎం విశ్వకర్మ’ అనే కొత్త స్కీమ్‌ను ప్రారంభించే ముందు ప్రధాని నరేంద్ర మోడీ విశ్వకర్మకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చేతి వృత్తి కళాకారులతో ముచ్చటించారు మోదీ. వాళ్ల బాగోగులను, ఉపాధి, పని గురించి అడిగి తెలుసుకున్నారు.

ఢల్లీ మెట్రోలో ప్రధాని మోడీ ప్రయాణిస్తున్న క్రమంలో ఓ యువతి ప్రధాని నరేంద్ర మోదీకి 73వ పుట్టినరోజు సందర్భంగా సంస్కృత భాషలో శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా సంస్కృత భాషలో పాట పాడుతూ ఆమె మోడీకి స్పెషల్‌ విషెస్‌ తెలిపింది.అదే విధంగా ఢల్లీిలో 73 వేల చదరపు విూటర్ల విస్తీర్ణంలో నిర్మించిన అంతర్జాతీయ కన్వెన్షన్‌ సెంటర్‌ (ఇండియా ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌పో సెంటర్‌ `ఎఎఅఅ) యశోభూమిని ప్రధాని మోదీ ప్రారంభించి జాతీకి అంకితం చేశారు. ద్వారకాలో యశోభూమి సమావేశ మందిరాన్ని అత్యాధునిక వసతులతో నిర్మించారు. ప్రపంచంలో అతిపెద్ద కన్వెన్షన్‌ సెంటర్‌ ఇదే కావడం విశేషం..

యశోభూమిలో 15 సమావేశ గదులను నిర్మించారు. వీటిలో ప్రధాన ఆడిటోరియంతో పాటు 13 ఇతర సమావేశ గదులు ఉన్నాయి. మొత్తం 11 వేల మంది ప్రతినిధులు సమావేశం అయ్యే విధంగా రూపొందించారు. ప్రధాన ఆడిటోరియంలో 6 వేల మంది కూర్చొనే వెసులుబాటు ఉంది. అంతేకాకుండా 1.07 చదరపు విూటర్ల విస్తీర్ణంలో ఎగ్జిబిషన్‌ ప్రాంతాన్ని కూడా ఏర్పాటు చేశారు.పటిష్టమైన భద్రతా చర్యలతో అత్యాధునిక హంగులతో కేంద్ర ప్రభుత్వం ఇండియా ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌పో సెంటర్‌ `ఎఎఅఅ ను నిర్మించింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....