యాదాద్రి భువనగిరి జూన్ ,29(ఇయ్యాల తెలంగాణ ):యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయానికి తొలి ఏకాదశి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా భక్తులు పోటెత్తారు.. ఉదయం 4 గంటల నుండి స్వామివారి గిరి ప్రదక్షణలో వేలాదిమంది భక్తులు స్వామివారిని నేరుగా ప్రసన్నం చేసుకునేందుకు భక్తి శ్రద్ధలతో గిరి ప్రదక్షిణం నిర్వహించారు. శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా ఆలయంలో శతఘటభిషేకం నిర్వహించారు స్వామివారి అభిషేకానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తొలి ఏకాదశి సందర్భంగా లక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో లక్ష్య పుష్పార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది
- Homepage
- Telangana News
- యాదాద్రికి పోటెత్తిన భక్తులు
యాదాద్రికి పోటెత్తిన భక్తులు
Leave a Comment