యువతకు Skill Development కమిటీ సమావేశం

స్వయం ఉపాధి కల్పనతో పాటు కులవృత్తుల పై ప్రత్యేక దృష్టి

కరీంనగర్‌, సెప్టెంబర్ 25 (ఇయ్యాల తెలంగాణ) : జిల్లాలో ఉపాధి కల్పించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు.  బుధవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో యువతకు స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. స్వయం ఉపాధి కల్పనతో పాటు కుల వృత్తులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.  గ్రామాల్లో డీ ఆర్డీఏ, పట్టణాల్లో మెప్మా, జిల్లాలో 10 మంది కంటే ఎక్కువ పని చేసే వ్యాపారాలు, ప్రైవేట్‌ కంపెనీలు సంస్థలను సంప్రదించి వారి అవసరాలకు అనుగుణంగా ఇంటర్‌, డిగ్రీ పూర్తి చేసిన యువకులకు అప్రెంటిస్షిప్‌ ఇవ్వాలని కోరాలన్నారు. పాఠశాలల్లో ఎనిమిదో తరగతి నుంచి ఇంటర్‌ విద్యార్థులకు ఆర్ట్‌ క్రాఫ్ట్‌లో ఎంబ్రాయిడరీ, టేలరింగ్‌ శిక్షణ ఇవ్వాలని విద్యాశాఖ అధికారులకు సూచించారు.

జూనియర్‌ కళాశాలల్లో ఉన్న ఒకేషనల్‌ కోర్సులు, అందించే శిక్షణ, శిక్షణ పొందిన వారి వివరాలు,  నేషనల్‌ అప్రెంటిషిప్‌ పథకం కింద శిక్షణ పొందిన వారి వివరాలతో నివేదిక అందించాలన్నారు.  నిర్మాణరంగంలో కార్పెంటర్‌, ఎలక్ట్రీషియన్‌, ప్లంబర్‌, వ్యవసాయ రంగంలో మిల్క్‌ టెస్టర్‌, బాయిలర్‌ ఫామ్‌ సూపర్‌ వైజర్‌, జ్యువెలరీ రంగంలో బ్యూటీషియన్‌,  ఫుడ్‌ ప్రొడక్ట్స్‌ విభాగం, ఫర్నిచర్‌ ఫిట్టింగ్‌ విభాగం, ఎలక్ట్రానిక్స్‌ విభాగం, టూరిజం హాస్పిటాలిటీ విభాగంలో ఉన్న కోర్సులపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు.  అందులో ఉన్న కోర్సులను వివరించేలా పోస్టర్‌ రూపొందించాలన్నారు. ఇందుకు సంబంధించి ప్రణాళికలను రూపొందించాలని శిక్షణ కలెక్టర్‌ అజయ్‌ కుమార్‌ కు సూచించారు.  ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన వంటి కేంద్ర పథకాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకుంటూ ఉపాధి కల్పనకు చర్యలు తీసుకోవాలన్నారు.

అదనపు కలెక్టర్‌ ప్రపుల్‌ దేశాయ్‌ మాట్లాడుతూ జిల్లాలో చాలామంది యువత విద్యార్హతలు కలిగి ఉన్నప్పటికీ నైపుణ్యాలు లేక ఉద్యోగాలు పొందడం లేదన్నారు. ఈ సమస్య పరిష్కారానికి నైపుణ్యాలు  కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. మొదట ఎంపిక చేసిన పది పాఠశాలల్లో విద్యార్థులకు వారంలో మూడు గంటలు ఆర్ట్‌ క్రాఫ్ట్‌ లో శిక్షణ ఇవ్వాలని అన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ చాహత్‌ భా జ్‌ పాయ్‌ పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో  జిల్లా ఉపాధి కల్పన అధికారి, స్కిల్‌ డెవలప్‌ మెంట్‌ కమిటీ కన్వీనర్‌ 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....