రక్షిత్‌ అట్లూరి ‘‘ఆపరేషన్‌ రావణ్‌’’ Movie !

ఈ నెల 26న వరల్డ్‌ వైడ్‌ గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌కు వస్తున్న రక్షిత్‌ అట్లూరి ‘‘ఆపరేషన్‌ రావణ్‌’’ సినిమా

రక్షిత్‌ అట్లూరి హీరోగా రాధికా శరత్‌ కుమార్‌ ముఖ్య పాత్రలో నటిస్తున్న కొత్త సినిమా ‘‘ఆపరేషన్‌ రావణ్‌’’. ఈ చిత్రాన్ని ధ్యాన్‌ అట్లూరి నిర్మాణంలో న్యూ ఏజ్‌ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ గా దర్శకుడు వెంకట సత్య తెలుగు మరియు తమిళ బాషల్లో రూపొందిస్తున్నారు. సంగీర్తన విపిన్‌ హీరోయిన్‌ గా నటిస్తోంది. ‘‘ఆపరేషన్‌ రావణ్‌’’ సినిమా వారం రోజుల ముందుగా ఈ నెల 26వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌ థియేట్రికల్‌ రిలీజ్‌ కు రాబోతోంది.

ఇటీవల రిలీజ్‌ చేసిన ‘‘ఆపరేషన్‌ రావణ్‌’’ ట్రైలర్‌ కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ ఎలిమెంట్స్‌ తో ట్రైలర్‌ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ‘‘ఆపరేషన్‌ రావణ్‌’’ సినిమాలో రాధికా శరత్‌ కుమార్‌, చరణ్‌ రాజ్‌, తమిళ నటుడు విద్యా సాగర్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా విజయంపై మూవీ టీమ్‌ కాన్ఫిడెంట్‌ గా ఉన్నారు.

నటీనటులు: రక్షిత్‌ అట్లూరి, సంగీర్తన విపిన్‌, రాధికా శరత్‌ కుమార్‌, చరణ్‌ రాజ్‌, కాంచి, రాకెట్‌ రాఘవ, రఘు కుంచె, కెఎ పాల్‌ రాము, విద్యా సాగర్‌, టీవీ5 మూర్తి, కార్తీక్‌ తదితరులు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....