గౌలిపుర,మే 13 (ఇయ్యాల తెలంగాణ) : అత్యంత ప్రాచీనమైన శ్రీ లక్ష్మీ నారాయణ స్వామీ దేవాలయంలో దేవాలయానికి సంబందించిన రథం మరమ్మతులకు ఉన్నందున దాతలు ముందుకు వచ్చి రథం కోసం ఆర్థిక సహాయం అందించవలసిందిగా దేవాలయం ధర్మకర్త ఎం. వి. శేషాద్రి అయ్యంగార్ కోరారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఓరుగల్లు రాణి రుద్రమ దేవి కాలంలో నిర్మితమైన శ్రీ శ్రీ శ్రీ లక్ష్మీ నారాయణ స్వామీ దేవాలయం ప్రతి ఏటా ఘనంగా జరుపుకొనే ఉత్సవాలకు ఉపయోగించే రథం రిపేరింగ్ కొరకు భక్తులు తమకు తోచిన సహాయం అందించ వలసినదిగా కోరుతున్నారు.
గౌలిపురా లోని గాంధీ బొమ్మ సమీపంలో గల ఈ యొక్క దేవాలయం ఏంతో ప్రసిద్ధి గాంచింది. ఇక్కడ కొలువుదీరి ఉన్న లక్ష్మీ నారాయణులు అత్యంత మహిమ గల వారిగా చెప్పుకుంటారు. పక్కనే ఉన్న రాజ రాజేశ్వరీ ఆలయం కూడా ప్రసిద్ధి గాంచింది. ఆలయ ప్రాగణంలో బయట ఉన్న కోనేరు ఇటీవలే ఆలయ ధర్మకర్త ఎం.వి.శేషాద్రి అయ్యంగార్ ప్రభుత్వ సహకారంతో ఆలయ కమిటీ సభ్యుల సహకారంతో అంత్యంత సుందరంగా తయారు చేయించడం జరిగింది. ఈ కోనేరు బతుకమ్మ బావిగా ఏంతో ప్రసిద్ధి గాంచింది. దసరా వేడుకలకు ఇక్కడకు చుట్టు పక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు విచ్చేయడం జరుగుతుంది. దసరా రోజు స్వామీ వారు రథంపై ఆలయ ప్రాంగణంలో ఉరేగింపుగా వెళ్లి భక్తులకు దర్శనమిస్తారు. ఏటా జరిగే ఉరేగింపు రథం మరమ్మతులకు ఉన్నందున దాతలు ముందుకు వచి రథం రిపేరింగ్ కు సహకారం అందించాలని కోరారు.
దాతలు A/C No:05451140274887 IFSC : HDFC0000545 లేదా మొబైల్ నంబర్ 9032567375 సంప్రదించగలరని కోరారు.