రధయాత్ర నుంచి భారతరత్న వరకు… LK. Advani రాజకీయ ప్రస్థానం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4 (ఇయ్యాల తెలంగాణ) : లాల్‌కృష్ణ అద్వానీ. ఇలా కాకుండా ఎల్‌కే అద్వానీ  అంటేనే అందరికీ తెలుసు. బీజేపీని ముందుండి నడిపించిన రథసారథుల్లో చాలా కీలకమైన వ్యక్తి ఆయన. 1951లో శ్యామ్‌ ప్రసాద్‌ ముఖర్జీ జన సంఫ్‌ుని  స్థాపించారు. అప్పుడే తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు అద్వానీ. 1970లో రాజ్యసభ ఎంపీగా ఎన్నికయ్యారు. 1989 వరకూ అదే పదవిలో కొనసాగారు. ఆ తరవాత జన సంఫ్‌ు కాస్తా భారతీయ జన సంఫ్‌ుగా మారింది. 1972లో ఈ పార్టీకి ప్రెసిడెంట్‌గా ఎన్నికయ్యారు అద్వానీ. 1975లో మొరార్జీ దేశాయ్‌ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు ప్రసార మాధ్యమ శాఖ మంత్రిగా పని చేశారు. ఆ తరవాత 1980లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేశారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయీతోకలిసి పార్టీని ముందుకు నడిపించారు. అయితే…1990ల తరవాతే ఆయనకు జనాల్లో మంచి పాపులారిటీ వచ్చింది. రామజన్మభూమి ఉద్యమంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించారు. అప్పుడు మొదలైన ఉద్యమమే ఇప్పుడు అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి కారణమైంది. వాజ్‌పేయీ క్యాబినెట్‌లో ఉప ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించారు. బీజేపీకి జాతీయ అధ్యక్షుడిగా మూడు సార్లు పని చేశారు. 1986`90లో ఆ తరవాత 1993`98 మధ్య కాలంలో ఈ బాధ్యతలు చేపట్టారు. మళ్లీ 2004`05 లో జాతీయ అధ్యక్షుడిగా ఏడాది పాటు సేవలు అందించారు.

 దాదాపు మూడు దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఆయన తొలిసారి హోం మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆ తరవాత 1999`2004 వరకూ వాజ్‌పేయీ హయాంలో ఉప ప్రధానిగా చేశారు. అద్వానీకి  రథసారథి అనే పేరుంది. అందుకు కారణం…ఆయన చేపట్టిన రథయాత్ర. 1990లో సెప్టెంబర్‌ 25వ తేదీన గుజరాత్‌లోని సోమ్‌నాథ్‌లో ఈ యాత్ర ప్రారంభించారు అద్వానీ. 1992లో డిసెంబర్‌ 6వ తేదీన బాబ్రీ మసీదుపై దాడితో అది ముగిసింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. రామజన్మభూమి ఉద్యమాన్ని మలుపు తిప్పింది. ఆ మలుపు తరవాత మరెన్నో మలుపులు తిరిగి చివరకు రామ మందిర నిర్మాణ కల నెరవేరింది. రాజనీతిజ్ఞుడిగా ఎంతో పేరు గడిరచారు అద్వానీ. మేధాశక్తితో పాటు నమ్మిని విలువలకు కట్టుబడి ఉండడం ఆయనకు మాత్రమే సొంతమైన ప్రత్యేకత. 1927లో నవంబర్‌ 8వ తేదీన జన్మించారు లాల్‌కృష్ణ అద్వానీ. భారత్‌ పాకిస్థాన్‌ విడిపోక ముందు సింధ్‌ ప్రావిన్స్‌లో పెరిగారు. కరాచీలోని ూబి ఖజీబితీతిఞస’బ ూఞష్ట్రనీనీశ్రీలో విద్యాభ్యాసం చేశారు. విద్యార్థి దశ నుంచే దేశభక్తి ఎక్కువ. ఆ సమయంలోనే  భావజాలం ఆయనను ఆకర్షించింది. జాతీయవాద సిద్ధాంతంపై ఆకర్షితుడైన ఆయన 14 ఏళ్లకే ఖీూూలో చేరారు. 1980ల నుంచి 1990 వరకూ బీజేపీని జాతీయ స్థాయిలో బలపరచాలన్న ఒకేఒక లక్ష్యంతో పని చేశారు అద్వానీ. ఆ శ్రమ వృథా కాలేదు. 1989లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. అంతకు ముందు 1984లో 86 సీట్ల మ్యాజిక్‌ ఫిగర్‌కి రెండు సీట్ల తక్కువ సాధించి అధికారాన్ని కోల్పోయింది. ఆ తరవాతే అద్వానీ మరింత పట్టుదలగా పని చేసి 1989లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. 1992లో రామజన్మభూమి ఉద్యమంతో బీజేపీకి జాతీయ స్థాయిలో ఆదరణ లభించింది. అప్పుడు జరిగిన ఎన్నికల్లో 121 సీట్లు సాధించింది.

ఆ తరవాత 1996లో 161 సీట్లతో అధికారంలోకి వచ్చింది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ తొలిసారి గద్దె దిగాల్సి వచ్చింది. సింగిల్‌ లార్జెస్ట్‌ పార్టీగా బీజేపీ అవతరించింది. బీజేపీ అధికారంలోకి వచ్చి అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ…13 రోజులకే ఆ ప్రభుత్వం పడిపోయింది. అయితే…1996లో జరిగిన ఎన్నికల్లో అద్వానీ పోటీ చేయలేదు. అప్పటికే ఆయనపై హవాలా స్కామ్‌ ఆరోపణలున్నాయి. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన పోటీ నుంచి తప్పుకున్నారు. ఎంపీ పదవికి రాజీనామా చేశారు. రాజకీయ విలువల గురించి పాఠాలు చెప్పే వ్యక్తిగానే కాకుండా వాటిని పాటించే వ్యక్తిగానూ గౌరవం సంపాదించుకున్నారు. 1998లో ఈ స్కామ్‌లో క్లీన్‌చిట్‌ వచ్చిన తరవాత మళ్లీ మెజార్టీతో ఎన్నికయ్యారు. ‘‘జాతీయవాదం విషయంలో ఆయన ఎప్పుడూ రాజీ పడలేదు. పరిస్థితులకు తగ్గట్టుగా రాజకీయాలు చేయడం ఆయనకు మాత్రమే చెల్లింది’’ అని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ ఎల్‌కే అద్వానీపై ఓ సందర్భంలో ప్రశంసలు కురిపించారు. సెక్యులర్‌ ఇండియా లక్ష్యంతో రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెట్టారు అద్వానీ. రాజస్థాన్‌లో ఖీూూ ప్రచారక్‌లా విధులు మొదలు పెట్టిన ఆయన ఆ తరవాత బీజేపీని ముందుకు తీసుకెళ్లే బాధ్యతల్ని తన భుజాలపై వేసుకున్నారు. 1990`97 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా బీజేపీ అంతగా బలపడిరది అంటే అందుకు కారణం కేవలం అద్వానీయే అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనకు ముందు అద్వానీ విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రసంగించారంటూ ఆరోపణలు వచ్చాయి. కూల్చివేత ఘటనకు ఆయననే బాధ్యుడిగా చేశారు. అయితే…2020లో అఃఎ స్పెషల్‌ కోర్టు ఆయనను నిర్దోషిగా తేల్చింది. అది ముందస్తు ప్రణాళికతో చేసిన దాడి కాదని, అప్పటికప్పుడు జరిగిందేనని కోర్టు తీర్పునిచ్చింది.

అప్పట్లో హిందుత్వానికి అద్వానీని బ్రాండ్‌ అంబాసిడర్‌గా భావించారు. హిందుత్వ విలువలను కాపాడుకోవాలన్న ఆయన విధానమే బీజేపీ రాజకీయ సిద్ధాంతమైంది. ఆయన రాజకీయ ప్రస్థానంలో రామ్‌ రథ యాత్రతో పాటు జనదేశ్‌ యాత్ర, భారత్‌ సురక్షా యాత్ర, స్వర్ణ జయంతి రథ్‌ యాత్ర, భారత్‌ ఉదయ్‌ యాత్ర..ఇలా పలు యాత్రలు చేపట్టారు. మొత్తంగా రాజకీయాల్లో ఇలా రథయాత్రల ట్రెండ్‌ని మొదలు పెట్టింది అద్వానీయే. రామ్‌రథ్‌ యాత్రతో అయోధ్య ఉద్యమానికి ఊపు తీసుకొచ్చారు. ఇటీవల జరిగిన రామ మందిర ప్రారంభోత్సవానికి ముందుగా ఆయనకు ఆహ్వానం అందలేదు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఆ తరవాత ట్రస్ట్‌ ఆయనకు ఆహ్వానం పంపింది. కానీ…వయసు రీత్యా ఆయన హాజరుకాలేకపోయారు. కానీ…రామ మందిర నిర్మాణం కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న వాళ్లంతా ఆ రోజు ఆయన పేరునే తలుచుకున్నారు. ఆయన సేవల్ని గుర్తించి 2015లో భారత ప్రభుత్వం పద్మవిభూషణ్‌ పురస్కారాన్ని ప్రదానం చేసింది. ఇప్పుడు అత్యున్నత పురస్కారమైన భారతరత్నను కట్టబెట్టింది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....