రాజస్థాన్‌ నుంచి Sonia నామినేషన్‌

జైపూర్‌, ఫిబ్రవరి 14 (ఇయ్యాల తెలంగాణ) : కాంగ్రెస్‌ రాజ్యసభ ఎన్నికలకు సిద్ధమైంది. ఇప్పటికే నలుగురు అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితాలో సోనియా గాంధీ కూడా ఉన్నారు. ఆమె తెలంగాణలో లోక్‌సభకు పోటీ చేస్తారన్న వార్తలు వచ్చినా…ఆమె రాజ్యసభకు పోటీ చేస్తున్నట్టు కాంగ్రెస్‌ ప్రకటించింది. రాజస్థాన్‌ నుంచి సోనియా బరిలోకి దిగుతున్నారు. ఆమెతో పాటు బిహార్‌ నుంచి డాక్టర్‌ అఖిలేష్‌ ప్రసాద్‌ సింగ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ నుంచి అభిషేక్‌ మను సింఫ్వీు, మహారాష్ట్ర నుంచి చంద్రకాంత్‌ హండోర్‌ని అభ్యర్థులుగా ప్రకటించారు. సోనియా గాంధీ ఇప్పటికే రాజస్థాన్‌ నుంచి నామినేషన్‌ వేశారు. జైపూర్‌ నుంచి ఆమె నామినేషన్‌ వేసినట్టు ప్రకటించారు. ఈ సమయంలో సోనియాతో పాటు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ ఉన్నారు. 1998 నుంచి 2022 వరకూ సోనియా గాంధీ కాంగ్రెస్‌ ప్రెసిడెంట్‌ బాధ్యతలు చేపట్టారు. ఐదు సార్లు లోక్‌సభ ఎంపీగా గెలిచారు. ఫిబ్రవరి 27వ తేదీన మొత్తం 56 సీట్లకు రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. 

తెలంగాణ నుంచి రేణుక చౌదరి, ఎం. అనిల్ కుమార్ యాదవ్

తెలంగాణ రాష్ట్రము నుంచి రేణుక చౌదరి, ఎం. అనిల్ కుమార్ యాదవ్ లను ప్రకటించే అవకాశాలున్నాయి.  ఈ ఏడాది ఏప్రిల్‌తో మన్మోహన్‌ సింగ్‌, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా రాజ్యసభ సభ్యత్వ గడువు ముగిసిపోనుంది. వీరితో పాటు మరో 9 మంది కేంద్రమంత్రుల సభ్యత్వమూ ముగిసిపోతుంది. వీళ్లలో అశ్వినీ వైష్ణవ్‌, ధర్మేంద్ర ప్రదాన్‌, భూపేంద్ర యాదవ్‌, మన్‌సుఖ్‌ మాండవీయ ఉన్నారు. ఫిబ్రవరి 8వ తేదీనే నామినేషన్‌ ప్రక్రియ మొదలైంది. ఫిబ్రవరి 15వ తేదీతో నామినేషన్‌ల స్వీకరణ గడువు ముగిసిపోతుంది. నామినేషన్ల ఉపసంహరణకు ఫిబ్రవరి 20 ఆఖరు తేదీ. ఫిబ్రవరి 27వ తేదీన ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకూ ఈ ఓటింగ్‌ కొనసాగుతుంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....