రాజ్యాంగ నిర్మాతపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బాబాసాహెబ్ విగ్రహానికి బీఎస్పీ పాలాభిషేకం

హైదరాబాద్, ఫిబ్రవరి 11 (ఇయ్యాల తెలంగాణ) : భారత రత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన అమర ప్రసాద్ పై పిడి యాక్ట్,, ధేశద్రోహం కేసు పెట్టాలని డిమాండ్ చేస్తూ… బీఎస్పీ నాయకులు ట్యాంక్ బండ్ అంబెడ్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. అంబెడ్కర్ పై అనుచిత వ్యాఖ్యలకు సహకరించిన, ప్రోత్సహించిన నాయకులపై కూడా తగిన చర్యలు తీసుకొని వారిని అరెస్టు చేయాలని బి.ఎస్.పి పార్టీ నాయకులూ డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్యాంక్ బండ్ వద్ద అంబేడ్కర్ విగ్రహానికి పాలతో అభషేకం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదారాబాద్ బీఎస్పీ నాయకులు, హైదరబాద్ జిల్లా బీఎస్పీ అద్యక్షుడు చాట్ల చిరంజీవి, సికింద్రాబాద్ నియోజక వర్గం  అద్యక్షులు సునిల్, ఛార్మినార్ నియోజక వర్గం అధ్యక్షులు మూల రామ్ చరణ్ దాస్ గ్రేటర్ హైదారాబాద్ బీఎస్పీ నాయకులు, ఇతర నియోజక వర్గం కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....