రామడుగు తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేసిన SC కుల పెద్ద మనుషులు !

రామడుగు, జూలై 17 (ఇయ్యాల తెలంగాణ) : రామడుగు మండల కేంద్రంలోని బేడ బుడగ జంగాల కులస్తులకు(ఎస్సీ) కుల ధ్రువీకరణ పత్రాలు జారీ చేయవద్దని రామడుగు ఎస్సీ మాదిగ పెద్ద మనుషుల సంఘం ఆధ్వర్యంలో తాసిల్దార్‌ కు వినతిపత్రం అందజేశారు. మేము రామడుగు గ్రామంలో పుట్టినప్పటి నుండి మేము మాదిగ కులస్తులము మా గ్రామమునకు ఇటీవల బుడిగజంగా కులమునకు చెందిన కులం వారు వలస వచ్చి ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో ఉన్నప్పుడు బుడిగజంగాలకు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వలేదు కానీ తెలంగాణ ప్రభుత్వం బెడ బుడగ జంగాలకు ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలను ఇస్తున్నారు. వారు ఎక్కడ నుంచి వలస వచ్చారో తెలియదు వారికి ఎస్సీ కులదృవీకరణ పత్రం ఇవ్వడం వలన మా మాదిగ కులస్తులు నష్టపోతున్నామని కావున బేడ బుడగ జంగాల వారికి ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రాలను ఇవ్వకూడదని ఎస్సీ మాదిగ కులస్తులు కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ మాదిగ పెద్దమనుషులు  పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....