రాష్ట్ర స్థాయికి 6 ప్రదర్శనలు ఎంపిక – 1 సైన్స్ సెమినార్ ఎంపిక : DEO

హైదరాబాద్, ఏప్రిల్ 10 (ఇయ్యాల తెలంగాణ)  సైన్స్ సెమినార్ లో విద్యార్థిని ప్రతిభ  ” భారతదేశంలో  సైంటిఫిక్ అకాడమిక్ సంస్థలు అనే అంశంపై  సయ్యద్ అబ్దుల్ ముఖ్తదీర్  9 వ తరగతి సన్ రైజ్ హైస్కూల్ ఆసిఫ్ నగర్ మండల్ హైద్రాబాద్ సైన్స్ సెమినార్ లో ప్రథమ స్థానంలో నిలిచారు , జిల్లా విద్యాశాఖాధికారిణి ఆర్. రోహిణి విడుదల చేశారు. మార్చ్ 16 వ తేదీ వరకు ఆన్లైన్లో నమోదు చేసిన జిల్లా స్థాయి జాతీయ జవహార్లాల్ నెహ్రూ సైన్స్ గణితం   పర్యావరణ ప్రదర్శనల నుండి  రాష్ట్ర స్థాయికి ఎంపికైన 6 ప్రదర్శనల వివరాలను జిల్లా విద్యాశాఖాధికారిణి ఆర్ రోహిణి విడుదల చేశారు .

జిల్లా స్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థుల ప్రదర్శన మాత్రమే రాష్ట్రస్థాయి సైన్స్ ఫేర్లో పాల్గొంటారని డీఈఓ తెలియజేశారు  .

(1)పర్యావరణ అనుకూల పదార్థం ఉప అంశంలో  :–కె .జాయ్ డేవిడ్ 9 వ తరగతి , 

సెయింట్ ఆంథోనీ హైస్కూల్ హిమాయత్నగర్  మండల్ హైద్రాబాద్  

(2) ఆరోగ్యం మరియు పరిశుభ్రత ఉప అంశంలో:– పై నాటి .వర్షిత  9 వ తరగతి 

 Auxillium హైస్కూల్ మహేంద్రహిల్స్ ,  మారేడ్ పల్లి మండలం, హైద్రాబాద్  .

(3) సాఫ్ట్వేర్ యాప్  ఉప అంశం లో :–  అపూర్వ సాహో 10 వ తరగతి 

సిస్టర్ నివేదిత స్కూల్ అమీర్ పేట్ మండల్  హైద్రాబాద్.

(4) రవాణా ఉప అంశంలో :– కె వర్షిణి,  7 వ తరగతి ప్రభుత్వ బాలికల,  హైస్కూల్ బొల్లారం ,  తిరుమలగిరి  మండలం  హైద్రాబాద్  .

(5) పర్యావరణం మరియు వాతావరణ మార్పు ఉప అంశంలో :– వి .సాయిచరణ్    9 వ తరగతి 

సెయింట్ అంతోనిస్ హై స్కూల్ హిమాయత్ నగర్ మండల్  హైద్రాబాద్  . 

(6) గణితం మోడలింగ్  ఉప అంశంలో:– సామియా ఫాతిమా 9 వ తరగతి ఎంఎస్ క్రియేటివ్ హైస్కూల్ మారేడ్ పలీ మండల్, హైద్రాబాద్  .

రాష్ట్ర స్థాయికి ఎంపికైన 6 విద్యార్థులు తమ ప్రదర్శనలను మరింత మెరుగుపర్చుకుని ఆన్లైన్లో నమోదుచేసీ రాష్ట్ర స్థాయిలో కూడా సత్తా చాటాలని  డీఈఓ తెలియజేశారు .

జిల్లా సైన్స్ అధికారి సీ ధర్మేందర్ రావు విద్యార్థులకు సూచనలు  :– 

రాష్ట్ర స్థాయికి ఎంపికైన విద్యార్థులు అంతర్జాలంలో ప్రయోగాలు నమోదు చేసేటప్పుడు వీడియో, ఆడియో,  ప్రయోగాలు రైటప్ స్పష్టంగా నమోదు చేయాలన్నారు, గైడ్ టీచర్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని విద్యార్థులతో అంతర్జాలంలో ప్రయోగాల వివరాలు నమోదు  చేయించాలని జిల్లా సైన్సు అధికారి సి. ధర్మేందర్ రావు విద్యార్థులకు సూచనలు చేశారు. 

సైన్స్ సెమినార్ లో పాల్గొంటున్న విద్యార్థి మరింత మెరుగుపర్చుకుని రాష్ట్రస్థాయిలో కూడా సత్తా చాటాలని డీఈఓ తమ ఆశాభావం వ్యక్తం చేశారు  .

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....