రాహుల్‌, ప్రియాంకలపైనే భారం..

హైదరాబాద్‌, అక్టోబరు 26, (ఇయ్యాల తెలంగాణ ); తెలంగాణలో అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్‌ పావులు కదుపుతోంది. ఇప్పటికే విజయభేరి బస్సు యాత్ర తొలి విడత సక్సెస్‌ కాగా? రెండో విడత యాత్రకు సిద్ధమవుతోంది. మరోసారి రాహుల్‌, ప్రియాంక గాంధీ తెలంగాణ పర్యటనకు రానున్నారు.తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ అగ్రనేత,ఎంపీ రాహుల్‌ గాంధీ,తన సోదరి,పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తో కలిసి అక్టోబర్‌ 18న ములుగు జిల్లా బహిరంగ సభలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. అనంతరం రాహుల్‌ గాంధీ అక్టోబర్‌ 19,20 తేదీల్లో ఉత్తర తెలంగాణలోని అయిదు జిల్లాలో పర్యటించారు. ఈ ప్రచారంలో భాగంగా వచ్చే నెల మొదటి వారంలో రెండో విడత బస్సు యాత్ర లో పాల్గొనేందుకు రాహుల్‌ గాంధీ సిద్ధమయ్యారు.ఆయన రెండో విడత బస్సు యాత్ర షెడ్యూల్‌ విడుదల కానప్పటికీ దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాలో ఆయన పర్యటించే అవకాశం ఉంది.వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడుతూ?. రాష్ట్రానికి మళ్ళీ రాహుల్‌ గాంధీ వస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ నిర్వహిస్తున్న బస్సు యాత్ర రెండో విడత ఈనెల 28 నుంచి ప్రారంభం అవుతుందని వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌ కుమార్‌ తెలిపారు. అయితే పార్టీ షెడ్యూల్‌ ను , అందులో పాల్గొనే నేతల షెడ్యూల్‌ ను మాత్రం ఇంకా ఖరారు చేయలేదన్నారు.తనకున్న సమాచారం మేరకు నవంబర్‌ మొదటి నెలలో రాహుల్‌ గాంధీ తెలంగాణ పర్యటన ఉంటుందని వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మహేష్‌ కుమార్‌ వెల్లడిరచారు. అలాగే కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఆరు ప్రదాన హావిూలను ప్రజలలోకి తీసుకెళ్లేందుకు ఈ నెల 27,28 తేదీల్లో పార్టీ వ్యవహారాల ఇంచార్జీ మాణిక్‌ రావు ఠాక్రే, తెలంగాణ పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి,నల్గొండ ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి,భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి లు రోజుకు రెండు నియోజికవర్గాల్లో పర్యటిస్తారన్నారు.అక్టోబర్‌ 31న రాష్ట్రంలో మళ్ళీ ప్రియాంక గాంధీ పర్యటిస్తారని,పాలమూరు జిల్లాలో బహిరంగ సభలో పాల్గొంటారన్నారు మహేశ్‌ గౌడ్‌. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యే అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కొల్లాపూర్‌ నియోజికవర్గంలో ఏర్పాటు చేయనున్న ‘‘ పాలమూరు విజయ భేరి ‘‘ సభలో ఆమె పాల్గొంటారని మహేష్‌ కుమార్‌ గౌడ్‌ వివరించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ డిల్లీలో కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల సంఘం సమావేశం జరుగుతుందని? ఆ తర్వాత రెండో విడత అభ్యర్ధల జాబితా ప్రకటించే అవకాశం ఉందన్నారు

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....