`రేవంత్‌ రెడ్డి దిష్టిబొమ్మ దగ్ధం చేసిన బిఆర్‌ఎస్‌ నాయకులు

మంథని జులై 12,(ఇయ్యాల తెలంగాణ ): `రైతుపక్షపాతిగా నిలుస్తున్న సీఎం కేసీఆర్‌ 

అనేక ఏండ్లు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం ఏనాడు రైతు సంక్షేమం కోసం పాటుపడలేదని, రైతులను మోసం చరిత్ర కాంగ్రెస్‌ పార్టీకే దక్కుతుందని బీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ఏగోళపు శంకర్‌గౌడ్‌ అన్నారు. కాంగ్రేస్‌ పార్టీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రైతుల కరెంటు విషయంలో మాట్లాడిన తీరును నిరసిస్తూ జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మదూకర్‌ ఆదేశాల మేరకు మంథని అంబేద్కర్‌చౌక్‌లో నిరసన చేపట్టి రేవంత్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్బంగా బీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు ఏగోళపు శంకర్‌గౌడ్‌ మాట్లాడుతూ ప్రజలను రైతులను మాయమాటలతో మభ్యపెట్టి మోసం చేస్తూ అనేక ఏండ్లు అధికారంలో ఉన్నారని, ఆనాడు రైతులకు, ప్రజలకు ఏలాంటి న్యాయం చేయలేదన్నారు. ఈనాడు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతు సంక్షేమాన్ని కోరి 24గంటల ఉచిత కరెంటు ఇస్తుంటే దాన్ని జీర్ణించుకోలేక రేవంత్‌ రెడ్డి విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నాడని ఆయన విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ పాలనతో ఆనందంగా ఉంటున్న రైతులకు అన్యాయం చేసేలా రేవంత్‌రెడ్డి ఆలోచన చేస్తున్నారని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ పార్టీ రైతులను విస్మరించడం మూలంగానే బీఆర్‌ఎస్‌కు అవకాశం కల్పించారని,తొమ్మిదేండ్లుగా రైతులకు చేస్తున్న అభివృధ్ది, సంక్షేమాన్ని చూసిన రైతులు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కే మద్దతు తెలుపుతున్నారని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌పార్టీ కుమ్ములాటల పార్టీగా పేరు తెచ్చుకుంందని, అధికారం కోసం ఆరాటమే తప్ప వాళ్లకు ప్రజలు, రైతుల సంక్షేమం అవసరం లేదన్నారు. అలాంటి కాంగ్రెస్‌ పార్టీని ప్రజలు నమ్మవద్దని, రాష్ట్రంలో రాబోయేది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ అని, మంథనిలో ఎమ్మెల్యేగా పుట్ట మధూకర్‌ గెలుస్తారని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ ఆరెపల్లి కుమార్‌, జెడ్పీటీసీ తగరం సుమలత శంకర్‌లాల్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ కొత్త శ్రీనివాస్‌, ఏఎంసీ చైర్మన్‌ ఎక్కటి అనంతరెడ్డి, పీఏసీఎస్‌ వైస్‌ చైర్మన్‌ ప్రకాష్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి అక్కపాక సంపత్‌, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు కనవేన శ్రీనివాస్‌, వార్డు కౌన్సిలర్‌లు వీకే రవి, గర్రెపల్లి సత్యం, సమ్మయ్య, సీపతి బానయ్య, నాయకులు గొబ్బూరి వంశీ, నక్క శంకర్‌, సత్యనారాయణ, ఎంఎస్‌ రెడ్డి, నీలం రమేష్‌, ఎరుకల రవి, గుండా పాపారావుతో పాటు తదితరులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....