రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే Criminal కేసులు


👉 నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా

👉  రైతులకు నకిలీ విత్తనాలు విక్రయిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తాం

👉 దొంగతనాల నివారణకు నిఘా వ్యవస్థను మరింత పటిష్ట పరచాలి

👉 జిల్లా ఎస్పీ సన్‌ ప్రీత్‌ సింగ్‌

జగిత్యాల, మే 24 (ఇయ్యాల తెలంగాణ) : నేర విచారణ మరింత సమర్ధవంతంగా చేయడంతో పాటు చాలా రోజుల నుండి పెండిరగ్లో ఉన్న కేసులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ వాటిని త్వరితగతిన పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని వాటిని సత్వరం పరిష్కరించే విధంగా పోలీస్‌ అధికారులంతా పని చేయాలని, నకిలీ విత్తనాలను అరికట్టేందుకు జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని  జిల్లా ఎస్పీ సన్‌ ప్రీత్‌ సింగ్‌ సూచించారు.శుక్రవారంజిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన నేర సవిూక్షా సమావేశంలో ఎస్పీ  మాట్లాడుతూ ఇప్పటివరకు నమోదైన కేసులలో నాన్‌ గ్రేవ్‌ కేసులు, గ్రేవ్‌ కేసుల విషయంలో తీసుకోవలసిన చర్యలు గురించి అధికారులకు వివరించారు. గుర్తుతెలియని మృతదేహాలు దొరికినప్పుడు కేసు నమోదు చేయగానే  వెంటనే ఫోటోలు సీసీటీఎన్‌ఎస్‌ లో అప్లోడ్‌ చేయాలని సూచించారు దీని ద్వారా ఎక్కడైనా మిస్సింగ్‌ పర్సన్‌ ఉంటే  రాష్ట్రవ్యాప్తంగా గుర్తించి మిస్సింగ్‌ కేసులను ఛేదించవచ్చని సూచించారు.దోపిడీ, దొంగతనాలు ఇతర రకాల నేరాలు జరగకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవడంతో పాటు పరిస్థితులను ఎప్పటికప్పుడు సవిూక్షిస్తూ ఉండాలని అధికారులను ఆదేశించారు. దొంగతనాల నివారణకు రాత్రిపూట పెట్రోలింగ్‌ వ్యవస్థను, నిఘా వ్యవస్థను పటిష్ట పరచాలి అని తెలిపారు. దొంగతనాల నివారణకు ప్రతి సర్కిల్‌ పరిధిలో ఒక స్పెషల్‌ టీం ను నియమించి వాటి నివారణకు కృషి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. నేర నియంత్రణ చర్యలలో కీలక పాత్ర పోషించే సి సి కెమెరాల ఏర్పాటు లో ప్రజలకు సీసీ కెమెరాల ఉపయోగలపై అవగాహన కలిగిస్తూ ప్రజలను, వ్యాపారులను భగస్వామ్యులను చేయాలని,  జిల్లాలో ఎక్కడెక్కడ సీసీ కెమెరాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని కెమెరాలు పని చేయు స్థితిలో ఉన్నాయి. ఇంకా ఎన్ని ప్రదేశాల్లో అవసరం ఉన్నాయో పూర్తి వివరాలు సేకరించాలని అన్నారు. ప్రతి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ప్రతి రోజూ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ టెస్ట్‌ లు, వాహన తనిఖీలు నిర్వహించాలని,బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే ప్రాంతాల పై  నిఘా ఉంచాలని  వారి పై కేస్‌ లు  నమోదు చేయాలని అన్నారు. జిల్లాలో గంజాయి,మత్తు పదార్థాలు పూర్తి స్థాయిలో నిర్ములించేందుకు జిల్లా పోలీస్‌ యంత్రంగం ప్రత్యేక ప్రణాళికలను ఏర్పాటు చేసుకొని మండలాల్లో, గ్రామాల్లో నిత్యం తనిఖీలు నిర్వహించాలని  అన్నారు. వివిధ జిల్లాల నుండి జిల్లాకు వచ్చే గంజాయి మూలలను,కీలక వ్యక్తులను గుర్తించి వారి పై కఠిన చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ప్రాసిక్యూషన్‌ లో భాగంగా కోర్టు వారు  జారిచేసిన  నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లను నిందితులపై లేదా తప్పించుకుని తిరుగుతున్న నేరస్తులపై అమలుపరచడానికి అధికారులు అందరూ కృషి చేయాలని సూచించారు..లోక్‌ అదాలత్‌ దృష్ట్యా  పోలీస్‌ అధికారులు రాజీ పడ దగిన కేసులను గుర్తించి ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సిలింగ్‌ నిర్వహించి రాజీ పడేటట్లు అవగాహన కల్పించాలని సూచించారు.నకిలీ విత్తనాలు విక్రయిస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో  క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని చెప్పారు..

జిల్లా పరిధిలో నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయాలకు పాల్పడే విక్రయదారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్‌ కేసులను నమోదు చేస్తాము అని తెలిపారు. మరియు సీడ్స్‌ అండ్‌ ఫర్టిలైజర్స్‌ షాప్‌ యజమానులు నిబంధనలకు లోబడి వ్యాపారాలు చేసుకోవాలని, నాణ్యమైన విత్తనాలు, ఎరువులు రైతులకు అందించాలని సూచించారు.  మార్కెట్లో బిటి3 పత్తి విత్తనాలకు ఎలాంటి పర్మిషన్‌ లేదు అనుమతి లేని విత్తన  విక్రయాల దారులవద్ద విత్తనాలు కొనుగోలు చేయవద్దని సూచించారు. మరియు విత్తనా డీలర్లుల వద్ద నే విత్తనాలు కొనుగోలు చేయలని, తప్పనిసరిగా బిల్‌ అడిగి తీసుకోవాలని తెలిపారు, మరియు గ్రామాల్లోకి వచ్చి విత్తనాలు.అమే వారి వద్ద విత్తనాలు కొనుగోలు చేయవద్దని తెలిపారు, ఎవరైనా గ్రామాల్లో కి వచ్చి విత్తనాలు అమ్ముచుంటే  ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేదని వాటిని కొన వద్దని  సూచించారు. గ్రామాల్లోకి వచ్చి ఎవరైనా విత్తనాలు అమ్మితే కొనుగోలు చేయ వద్దని వెంటనే సంబంధిత  పోలీస్‌ స్టేషన్లకు/వ్యవసాయ అధికారుల కు తెలపాలని లేదా డయల్‌ 100 కాల్‌ చేసి తెలిపినచో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని గారు తెలిపినారు. ఈ యొక్క నకిలీ విత్తనాల నివారణ కోసం స్పెషల్‌ టాస్క్‌ ఫోర్స్‌ టీం ఏర్పాటు చేయడం జరిగిందని ఈ యొక్క టీం జిల్లాలో వ్యవసాయ అధికారులను సహాయంతో అన్ని ఎరువుల దుకాణంలో తనిఖీ చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ సమావేశంలో డీఎస్పీలు రవీందర్‌ కుమార్‌ , రఘు చందర్‌,ఉమామహేశ్వర రావు,రంగా రెడ్డి, వ్యవసాయ అధికారులు,డీసీఆర్భీ,సీసీఎస్‌, ఐటి కోర్‌  ఇన్స్పెక్టర్‌ లు శ్రీనివాస్‌, లక్ష్మీనారాయణ , , రఫీక్‌ ఖాన్‌, సి.ఐ లు, ఎస్‌.ఐ లు,డీసీఆర్భీ,ఐటీ కోర్‌ సిబ్బంది  పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....