హైదరాబాద్, మార్చి 29 (ఇయ్యాల తెలంగాణ) : రైతుల సమస్యలపై చర్చలు జరిపి ఒక కొలిక్కి తేకుండా ఓట్ల కోసం రాష్ట్రం లోని రైతులను బలి పశువులను చేస్తున్నారని తెలంగాణ జన సమితి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్ కోదండరామ్ అన్నారు. టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రెస్ మీట్ లో ఆయన పాల్గొని రైతు సమస్యలపై ప్రసంగించారు. రైతు జీవితాలతో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆడుకుంటున్నాయని మండిపడ్డారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం టీజేఎస్ పార్టీ ఆధ్వర్యంలో కామారెడ్డి, సిరిసిల్ల, జగిత్యాల, జీల్లాల్లో త్వరలో రైతు రక్షణ యాత్రను చేపడుతామని అన్నారు. అదే విధంగా క్రిష్ణా జలాల పరిరక్షణ కోసం మరో యాత్రను చేపట్టడానికి కార్యచరణ సిద్దం చేశామన్నారు. ఇక కేంద్రం పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచితే, రాష్ట్ర ప్రభుత్వం కరేంటు చార్జీలు పెంచి ప్రజల బతుకులను ఆగం చేస్తున్నారని కోదండరామ్ అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచిన ధరలు వెంటనే దించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని హేచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పీఎల్ విశ్వేశ్వర రావు, ప్రధాన కార్యదర్శి నిజ్జన రమేష్ ముదిరాజ్, జాయింట్ సెక్రటరీ ఎస్ సత్యనారాయణ, పార్టీ అధికార ప్రతినిధి పల్లే వినయ్ కుమార్, రంగారెడ్డి, కొత్త రవి, గ్రేటర్ హైదరాబాద్ టీజేఎస్ పార్టీ అధ్యక్షుడు ఎం నర్సయ్య, ప్రధాన కార్యదర్శి బట్టల రాంచందర్, బీసి సేల్ అధ్యక్షుడు జశ్వంత్, సనత్ నగర్ ఇన్చార్జ్ రమేష్ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి వనమల శివచరణ్, తదితరులు పాల్గొన్నారు.
- Homepage
- Telangana News
- రైతులను బలి పశువులను చేస్తున్నారు : TJS పార్టీ అధ్యక్షుడు కోదండరామ్
రైతులను బలి పశువులను చేస్తున్నారు : TJS పార్టీ అధ్యక్షుడు కోదండరామ్
Leave a Comment