రోజూ కొద్ది మోతాదులో పల్లీలు తింటే గుండె – Heart పదిలం

మీకు పల్లీలు  తినే అలవాటు ఉందా? అయితే, రోజూ కొద్ది మోతాదులో తింటే గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. పల్లీలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల కార్డియో వాస్క్యులర్‌ వ్యాధులు వచ్చే ఆస్కారం చాలా తక్కువని పరిశోధనల్లో తేలింది.అయితే, రోజూ సగటున ఎన్ని పల్లీలు తినాలి? అంటే, ఏ సమయంలోనైనా ఫర్వాలేదు కానీ.. 4`5 వేరు శెనగలు అంటే.. పది గింజల వరకే తినాలట. దీని వల్ల కెమికల్‌ స్ట్రోక్‌/కార్డియో వాస్క్యులర్‌ సమస్య దరిదాపుల్లోకి కూడా రాదని చెబుతున్నారు జపాన్‌లోని ఒసాకా యూనివర్సిటీకి చెందిన పరిశోధన బృందం సభ్యులు. పల్లీల్లో గుండెకు మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిలోని మోనోశాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్స్‌, పాలీ అన్‌శాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్స్‌, మినరల్స్‌, విటమిన్స్‌ వంటివి మంచి చేస్తాయి. అలాగే అధిక రక్తపోటు, చెడు కొలెస్ట్రాల్‌ను నియంత్రణలో ఉంచుతాయని కూడా జపాన్‌ పరిశోధకులు చెబుతున్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....