లక్కీ భాస్కర్‌ Movie స్టైల్లో రాబరీ !

హైదరాబాద్‌, డిసెంబర్‌ 11, (ఇయ్యాల తెలంగాణ) : ఇటీవల విడుదలైన లక్కీ భాస్కర్‌ సినిమా.. టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిన విషయం తెలిసిందే. వెంకీ అట్లూరీ డైరెక్షన్‌లో దుల్కర్‌ సల్మార్‌ హీరోగా నటించిన లక్కీ భాస్కర్‌ సినిమాలో.. కొంతమంది బ్యాంకు అధికారులు ఎలా మోసాలకు పాల్పడతారు..? నకిలీ స్టేట్‌ మెంట్లు, ఫోర్జరీలతో కోట్లకు కోట్లు ఎలా కొల్లగోడతారన్నది కళ్లకు కట్టినట్టుగా చూపించారు. అయితే.. సినిమాలో స్టాక్‌ మార్కెట్‌ను శాసించే ఓ వ్యక్తి కేంద్రంగా సాగే కథలో.. బ్యాంకు అధికారులంతా ఎలా భాగమై అవినీతికి అలవాటు పడతారనేది చూపించారు. అయితే.. అది కొన్ని నిజమైన సంఘటనలను ఆధారంగా చేసుకుని కల్పిత పాత్రలతో సినిమాగా తెరకెక్కించగా.. ఇక్కడ కొందరు బ్యాంకు అధికారులు మాత్రం నిజంగానే అవినీతికి పాల్పడి.. కోట్లకు కోట్లే మింగేశారు. నకిలీ చెక్కులు, ఫోర్జరీలతో ఓ ఎన్నారై ఖాతాను ఖాళీ చేసేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన.. పంజాగుట్ట పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది.పోలీసుల కథనం ప్రకారం.. ఆస్ట్రేలియా న్యూసౌత్‌ వేల్స్‌, సిడ్నీ క్వాకర్స్‌ హిల్‌, లవర్‌ గ్రోవ్‌డ్రైవ్‌లో నివాసముండే పరితోష్‌ ఉపాధ్యాయ్‌కు హైదరాబాద్‌లోని బేగంపేట యాక్సిస్‌ బ్యాంక్‌లో 2017 నుంచి ఖాతా ఉంది. అయితే.. 2024, అక్టోబర్‌ 21న యాక్సిస్‌ బ్యాంకు ఖాతాను మూసివేసినట్టుగా మెయిల్‌ వచ్చింది. ఆ మెయిల్‌ చూసుకుని పరితోష్‌ ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. 

అదేంటని.. చూస్తే తన ఖాతా ఖాళీ అయినట్టు గుర్తించాడు.దీంతో.. బ్యాంకుకు వెళ్లి విచారించగా.. 42 చెక్కులతో డబ్బులు డ్రా చేసినట్టుగా తేలటంతో అసలు విషయం అర్థమైంది. ఎవరో నకిలీ చెక్కులతో, తన సంతకాన్ని ఫోర్జరీ చేసి డబ్బులు దోచుకున్నట్టు పరితోష్‌ గుర్తించాడు. ఈ విషయంపై బ్యాంకు సీఈవోను సంప్రదించగా.. ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బాధితుడు వెంటనే పోలీసులను ఆశ్రయించాడు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు ప్రారంభించారు.అయితే.. సదరు బ్యాంకు సీనియర్‌ పార్టనర్‌ వెంకటరమణ, ఉద్యోగులైన.. సురేఖ, హరి విజయ్‌, శ్రీదేవి, రఘుతో కలిసి పరితోష్‌ ఖాతాలోని డబ్బులను కాజేసేందుకు పథకం రచించారు. పరితోష్‌ పేరు విూద నకిలీ చెక్కులు తయారు చేసి, దానిపై సంతకాలు ఫోర్జరీ చేసి ఖాతాదారుడికి తెలియకుండానే రూ.6.5 కోట్లు డ్రా చేసుకున్నట్టు తేలింది. అయితే.. ఇది కోర్టు రిఫర్‌ కేసు అయినా నెల రోజుల వరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించలేదన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. బ్యాంకుల్లో దాచుకుంటే తమ డబ్బు సురక్షితంగా ఉంటుందని భావిస్తే.. అధికారులు ఇలా చేయటం.. అది కూడా ఓ పేరున్న బ్యాంకులోని అధికారులు ఇలా మోసానికి పాల్పడటం ఖాతాదారులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....