సిద్దిపేట జులై 6 (ఇయ్యాల తెలంగాణ );ప్రభుత్వం నిషేధించిన వివిధ రకాల గుట్కా ప్యాకెట్లు, విలువ 1,46,130 రూపాయలు పట్టుకున్న సిద్దిపేట టాస్క్ ఫోర్స్ మరియు సిద్దిపేట టూ టౌన్ పోలీసులు. ద్దిపేట పట్టణం టీ. మురళీకృష్ణ, హోల్ సేల్ కిరాణా షాప్ యజమాని తెరల సాయి కృష్ణ నివాసం సిద్దిపేట పట్టణం. అతను ప్రభుత్వం నిషేధించిన వివిధ రకాల గుట్కా ప్యాకెట్లు కాటన్ డబ్బాలతో హోల్ సేల్ గా అమ్ముతున్నాడని అమ్మదగిన సమాచారంపై సిద్దిపేట టాస్క్ ఫోర్స్ అధికారులు సిబ్బంది సిద్దిపేట టూ టౌన్ పోలీసులు కలసి వెళ్లి షాపులో తనిఖీలు నిర్వహించగా ప్రభుత్వం నిషేధించిన వివిధ రకాల గుట్కా ప్యాకెట్లు కాటన్ బాక్సులలో ప్యాక్ చేసి ఉన్నవి మొత్తం గుట్కా ప్యాకెట్ల విలువ 1,46,130 గలవిపట్టుకున్నారు.సిద్దిపేట టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి పరిశోధన ప్రారంభించారు.ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ పోలీస్ అధికారులు, మాట్లాడుతూ. పోలీస్ కమిషనర్ ఆదేశానుసారం జిల్లాలో ఎక్కడైనా ప్రభుత్వ అనుమతి లేకుండా ఇసుక, పిడిఎస్ రైస్ అక్రమ రవాణా చేసిన నిల్వ ఉంచిన, చట్ట ప్రకారం కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జూదం, గ్యాంబ్లింగ్ చట్ట వ్యతిరేక కార్యక్రమాలపై ప్రభుత్వం నిషేధించిన గుట్కాలపై పటిష్టమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.గ్రామాలలో, పట్టణాలలో ఇసుక, అక్రమ రవాణా చేసిన, పిడిఎస్ రైస్ అక్రమంగా దాచిపెట్టిన రవాణా గ్యాంబ్లింగ్, పేకాట, ప్రభుత్వం నిషేధించిన గుట్కాలు కలిగి ఉన్నా రవాణా చేసిన మరిఏదైనా చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిస్తే సిద్దిపేట టాస్క్ ఫోర్స్ అధికారుల నెంబర్లు 8712667445, 8712667446, 8712667447 లకు సమాచారం అందించాలని సూచించారు. సమాచారం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు.
- Homepage
- Telangana News
- లక్షల విలువ గల GUTKAలు స్వాధీనం
లక్షల విలువ గల GUTKAలు స్వాధీనం
Leave a Comment