లిఫ్టిస్తానని అత్యాచారం

హైదరాబాద్‌, జూలై 21, (ఇయ్యాల తెలంగాణ ): ఎన్ని చట్టాలు వచ్చినా మహిళలపై అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. మహిళలు కనిపిస్తే చాలు మాటలు కలిపి మంచితనం నటించి వారిపై లైంగిక దాడులకు పాల్పడుతున్నారు. ఎదుటివారిది నటన అని గ్రహించని మహిళలు, అమ్మాయిలు వారిని నమ్మి కామాంధుల చేతిలో నలిగిపోతున్నారు. వారితో ప్రయాణించే సమయంలో మగాళ్లతో వెళితే మృగాళ్లా మారుతారని ఊహించలేక.. వారి అకృత్యాలకు బలవుతున్నారు. వారి బలహీనతే మగాళ్లకు అవకాశంగా మారుతోంది. మహిళల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని వారిని బెదిరించి లోబరుచుకుంటున్నారు. గుడ్డిగా నమ్మడం వలన వారి జీవితాలు నాశనం అవుతున్నాయి. ఇలాంటి ఘటనే హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.హైదరాబాద్‌ మధురానగర్‌ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. వర్షంలో నడుచుకుంటూ వెళ్తున్న మహళకు ఓ కారు డ్రైవర్‌ లిఫ్ట్‌ ఇస్తానని ఆపాడు. దానికి ఆమె వద్దుంటూ ముందుకు నడుచుకుంటూ వెళుతున్న కారు డ్రైవర్‌ వర్షం ఎక్కువగా వస్తుంది. నేను లిప్ట్‌ ఇస్తాను భయపడకండీ ఎక్కువగా నానిపోతారు అంటూ నమ్మబలికాడు. దీంతో కారు డ్రైవర్‌ ను నమ్మిన ఆ మహాళ కారులో వెనుక సీట్‌ లో ఎక్కేందుకు వెళ్లింది. వెనుక వద్దూ ముందుకు వచ్చి కూర్చోవాలని కోరాడు. దీంతో ఆ మహిళ కారులో ముందుకు వచ్చి కూర్చొంది. ఒకచోట పని ఉందని చెప్పి నిర్జీవ ప్రదేశానికి తీసుకువెళ్లాడు. ఎక్కడకు తీసుకుని వెళుతున్నావ్‌ అని ప్రశ్నించిన ఆమెకు సమాధానం ఇవ్వలేదు కారు డ్రైవర్‌. దీంతో ఆ మహిళ అరవడంతో చంపేస్తానంటూ బెదిరించాడు. ఆపై ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈవిషయం ఎవరికి చెప్పకూడదని బెదిరించి ఆమెను కారులోనుంచి బయటకు తోసేశాడు. దయనీయ స్థితిలో వున్న మహిళను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటా హుటిన ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని సీసీ ఫుటేజ్‌ ను పరిశీలిస్తున్నారు. కారు డ్రైవర్‌ ను త్వరలో పట్టుకుని కఠినింగా శిక్షిస్తామని తెలిపారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....