లోతట్టు ప్రాంతాల ప్రజల తరలింపు

 

వరంగల్‌ జులై 26, (ఇయ్యాల తెలంగాణ ):గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో? నగరంలోని లోతట్టు ప్రాంతాలను వరంగల్‌ పోలీస్‌ కమిష నర్‌ ఏవీ రంగనాథ్‌ పోలీస్‌ అధికారు లతో పరిశీలించారు.ఈ సందర్భంగా పోలీస్‌ కమిషనర్‌ వరంగల్‌ హంటర్‌ రోడ్‌ లోని ఎన్టీఆర్‌ కాలనీ, సాయినగర్‌ కాలనీ, సంతోషమాత కాలనీ బృందా వన్‌ లలో పూర్తిగా వరద నీరు రావడం తో వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ స్థానిక పోలీస్‌ అధికారులతో కల్సి ట్రాక్టర్‌ లో ప్రయాణించి ప్రస్తుత పరిస్థితులను పరిశీలించారు.

కాలనీల్లో వరద నీరు చేరుకోవడంతో ఈ కాలనీల్లో నివాసం వుంటున్న ప్రజలను సురక్షిత ప్రాంతా లను తరలింపు విషయమై పోలీస్‌ కమిషనర్‌ వరంగల్‌ ఏసీపీ బోనాల కిషన్‌, మట్టేవాడ ఇన్స్‌ స్పెక్టర్‌ వెంకటే శ్వర్లు, బీఆర్‌ఎస్‌ నాయకుడు గందే నవీన్‌ ను అడిగి తెలుసుకున్నారు. హంటర్‌ రోడ్డులోని ఎన్టీఆర్‌ కాలనీ, సాయినగర్‌ కాలనీ, సంతోషమాత కాలనీ బృందావన్‌ లలో పెద్ద స్థాయిలో వరద నీరు చేరుకోవడంతో పోలీస్‌ కమిషనర్‌, జిల్లా కలేక్టర్‌ ఆదేశాల మేరకు మట్టేవాడ పోలీసులు వరంగల్‌ ఏసీపీ కిషన్‌, ఇన్స్‌ స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీసులు, గ్రేటర్‌ వరంగ ల్‌ మన్సిపల్‌ కార్పొరేషన్‌ సిబ్బంది సంయుక్తంగా కల్సి లోతట్టు ప్రాంతా ల్లోని ప్రజలను బొట్లు ద్వారా సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....