భద్రాద్రి ఆగష్టు 3,(ఇయ్యాల తెలంగాణ ):భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో కేంద్ర బృందం ఏడుగురు సభ్యులతో గోదావరి వరద ప్రాంతాలను పరిశీలించింది. బూర్గంపాడు మండల కేంద్రం లోని పులితేరు వాగు ఏరియాలో ఉన్న పంట పొలాలు, కొల్లు చెరువు ఏరియాలో ఉన్న పంట పొలాలను బృందం పరిశీలించింది. బూర్గంపాడు మండల పరిధిలో సుమారు 500 ఎకరాల వరి, ప్రత్తి,మొక్కజొన్న, కూరగాయల పంటలు వరదకు నష్టపోయాయి. కేంద్ర బృందానికి ఈ ప్రాంతంలో జరిగిన పంట నష్టాన్ని జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆల తెలియజేశారు. పలువురు రైతులు కేంద్ర బృందానికి పంట నష్టం వివరాలు తెలియజేశారు. రైతులను పంట నష్టం వివరాలు అడిగి తెలుసుకుని వివరాలు కేంద్ర బృందం సేకరించింది. …