లక్నో మే 14 (ఇయ్యాల తెలంగాణ) : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం వారణాసి లో నామినేషన్ దాఖలు చేశారు. మోదీ సన్నిహితులు, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరికొంతమంది ప్రముఖుల సమక్షంలో ఆయన నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. ఇక్కడి నుంచి ఇప్పటి వరకు రెండు సార్లు గెలిచిన ఆయన హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు అమిత్ షా రాజ్‌నాథ్ సింగ్ తదితరులు ఉన్నారు. అలాగే ఏపీ నుంచి మోదీ నామినేషన్ కార్యక్రమానికి టీడీపీ అధినేత, చంద్రబాబు జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హాజరయ్యారు. కాగా, ప్రధాని మోడీ వరుసగా మూడోసారి వారణాసి నుంచి పోటీ చేస్తున్నారు. ఇంతకుముందు 2014, 2019లో ఇక్కడి నుంచే పోటీ చేసి ఆయన గెలుపొందారు. జూన్ 1న ఏడో దశ ఎన్నికల్లో వారణాసిలో పోలింగ్ జరగనుంది. ఇక్కడ మోడీపై కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ పోటీ చేస్తున్నారు.
- Homepage
- National News
- వారణాసిలో నామినేషన్ దాఖలు చేసిన PM నరేంద్ర MODI
వారణాసిలో నామినేషన్ దాఖలు చేసిన PM నరేంద్ర MODI
Leave a Comment