విగ్రహాల కోనుగోలుతో మొదలైన Ganesh సందడి

పత్తికొండ,సెప్టెంబర్ 16 (ఇయ్యాల తెలంగాణ) : గణపతి ఉత్సవాలు  పత్తికొండ మండలంలో ఘనంగా జరుగుతున్నాయి.   చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు తారతమ్యాలు లేకుండా ప్రతీఒక్కరూ అత్యంత ఇష్టంతో ఆహ్లాదంగా జరుపుకునే పండుగ వినాయక చవితి. విఘ్నాలకు అధిపతి వినాయకుడు కావడంతో జనం ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటారు.  వినాయక చవితి సందర్భంగా పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. స్థానిక నాలుగు స్తంభాల నుంచి బస్తా బస్టాండ్‌, అంబేద్కర్‌ విగ్రహం వరకు వరకు వినాయక విగ్రహా లు, పూజ సామాగ్రి కొనుగోలు చేసి వ్యక్తులతో సందడి నెలకొంది. ఈ సందర్భంగా వినాయక నవరాత్రి ఉత్సవాల కోసం నిర్వహకులు పట్టణాలలో వివిధ రకాలైన విగ్రహాలను కొనుగోలు చేసి మండపాలు ఏర్పాటు చేస్తారు.  గణేశ్‌ నవరాత్రి ఉత్సవాలకు పత్తికొండ ముస్తాబైంది. ఐదు అడుగుల నుంచి 20 అడుగుల వరకు వివిధ ఆకారాల్లో గణనాథులు కొలువుదీరుతున్నాయి. విభిన్న రూపాల్లో కలర్‌ఫుల్‌గా లంబోదరుడు కనువిందు చేస్తున్నాడు. ఆధ్యాత్మిక శోభ ఉట్టిపడే విధంగా గణపతిబప్పా మోరియా అంటూ నినాదాలు చేస్తూ గణనాథులు తరలివస్తున్నారు.
iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....