విద్యార్థులను క్రీడల్లో తీర్చిదిద్దాలి

నందికొట్కూరు సెప్టెంబర్‌ 30 (ఇయ్యాల తెలంగాణ ):పాఠశాలల్లో విద్యార్థులను క్రీడల్లో తీర్చిదిద్దాలని మండల విద్యాధికారి ఫైజునిస్సా తెలిపారు. శనివారం నందికొట్కూరు పట్టణంలోని స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు నియోజకవర్గస్థాయి కాంప్లెక్స్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయులు అయ్యప్ప రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వ్యాయామ ఉపాధ్యాయులకు స్కూలు కాంప్లెక్స్‌ స్థాయి సమావేశాలు నిర్మిస్తున్నామని తెలిపారు. ఈ సమావేశాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని పాఠశాలల్లోని విద్యార్థులకు క్రీడా నైపుణ్యాలు పొందించేలా చేయాలని తెలిపారు. అనంతరం సమావేశం లో వ్యాయామ ఉపాధ్యాయులను ఆమె పరిచయం చేసుకున్నారు. నంద్యాల కర్నూలు జిల్లాల షాప్‌ కోఆర్డినేటర్లు స్వామి దాసు రవి కుమార్‌, శ్రీనాథ్‌, మండల కోఆర్డినేట్లు వీరన్న కృష్ణ శ్రీనివాసులు,నాగరాజు,మురళి నాయక్‌,  వెంకటేశ్వర్లు,  ఫిజికల్‌ డైరెక్టర్లు చంద్రమోహన్‌, రామకృష్ణ, భాస్కర్‌ రెడ్డి,  సుంకన్న, శ్రీధర్‌ కుమార్‌,  శివన్న,  కిరణ్‌, తదితరులు పాల్గొన్నారు.

iyyala telangana: ఇయ్యాల తెలంగాణ తెలుగు దినపత్రిక గత 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి సరికొత్త వార్తా ధోరణితో పాఠకుల ఆదరణ పొందుతుంది. అనతి కాలంలోనే విశేష ఆదరణ పొంది ఏంతో మంది పాఠకులకు చెరువవుతుంది. మీ అందరి ఆధర అభిమానులతో ముందుకు వెళుతూ ఎప్పటికప్పుడు సరికొత్త వార్తా సమాచారాలను అందరికి అందించాలనే ఆకాంక్షను అందరు ఆదరిస్తూ ఉంటారని ఆశిస్తున్నాము. ప్రస్తుతం అనేక మంది వీక్షకులు, పాఠకులు ఆన్ లైన్ వార్తలనే ఎక్కువగా కోరుకుంటుండటంతో మీ ముందుకు ఎప్పటికప్పుడు నిజమైన వార్తలను ముందుచేలా చేస్తున్న ఇయ్యాల తెలంగాణ పత్రిక, ఆన్ లైన్ సామ్రాజ్యాన్ని ప్రతి ఒక్కరూ ఆదరిస్తూ ఉంటారని మా ఆకాంక్ష .....